Terrorists Killed : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటనకు ముందు ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్(Terrorists Killed) లో ఇద్దరు ఉగ్రవాదులు ఖతం అయ్యారు.
ఆగస్టు 2019 లో పర్యటించారు. మూడేళ్ల అనంతరం మోదీ మరోసారి పర్యటిస్తున్నారు. ఆయన రాజకీయ టూర్ కు ముందు జమ్మూ లోని కీలకమైన సైనిక స్థావరం సమీపంలో ఉగ్రవాదుల ఉనికి ప్రధాన భద్రత సమస్య.
జమ్మూ నగరంలోని సుంజ్వాన్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున జమ్మూ లోని ఆర్మీ ఇన్ స్టాలేషన్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు(Terrorists Killed) మరణించారు. ఈ ఘటనలో ఒక భద్రతా అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా దళాలు ముందస్తు ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఎన్ కౌంటర్ ప్రారంభమైంది.
నగరంలో ఉగ్రవాదులు దాడికి ప్లాన్ చేసినట్లు తమకు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( సీఐఎస్ఎఫ్ ) టెర్రరిస్టులు తమ సిబ్బందిని ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు.
ఇందులో సబ్ ఇన్స్ పెక్టర్ మరణించారని జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్ బాబ్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర మోదీ పర్యటించాల్సి ఉండడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది.
కేంద్ర హోం శాఖ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : జిగ్నేష్ మేవానీ ఎవరో తెలియదు – సీఎం