5G Auction Race : 5జీ వేలానికి వేళాయెరా
అదానీ..అంబానీ..మిట్టల్
5G Auction Race : భారతీయ వ్యాపార దిగ్గజాల మధ్య నువ్వా నేనా అన్న పోటీకి రంగం సిద్దమైంది. దేశ వ్యాప్తంగా కీలకంగా మారిన 5జీ వేలం(5G Auction Race) రేసు మంగళవారం ప్రారంభమైంది.
$14 బిలియన్ల 5జీ వేలం రేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, ఎయిర్ టైల్ చైర్మన్ మిట్టల్ తో పాటు వొడా ఫోన్ ఐడియా, తదితర కంపెనీలు బరిలో ఉండనున్నాయి.
ఇప్పటికే ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్ గేట్స్ ను దాటేసి నాలుగో స్థానంలో నిలిచాడు గౌతం అదానీ. ఇప్పటి వరకు ఇతర రంగాలపై ఫోకస్
పెట్టిన ఈ కుబేరుడు ఉన్నట్టుండి 5జీ వేలంపై ఫోకస్ పెట్టాడు.
ఇది చర్చనీయాంశంగా మారింది వ్యాపార వర్గాలలో. దీంతో కుబేరుల మధ్య బిగ్ ఫైట్ నెలకొనే చాన్స్ ఉంది. ఇక కేంద్ర సర్కార్ మాత్రం ఎంత వీలైతే అన్ని కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్.
ఇప్పటికే ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టింది. ఇందులో భాగంగా 5జీ వేలం ద్వారా భారీ ఎత్తున ఆదాయం సమకూర్చు
కోవాలనే దానిపై దృష్టి పెట్టింది.
ఈ వేలం పాట ద్వారా $14 బిలియన్ల వరకు రాబట్టాలని చూస్తోంది. ఇవాళ వేలం పాటకు సంబంధించి బిడ్ చేపట్టాలని నిర్ణయించింది.
దేశానికి సంబంధించి ఐదో తరం ప్రసారాల కోసం దేశంలోని అత్యంత ధనిక వ్యాపారవేత్తలను ఆకర్షిస్తోంది. బిలియనీర్లు ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీలు డిజిటల్ యుగంలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో నిర్ణయించే ఫ్రీక్వెన్సీ హక్కుల కోసం $14 బిలియన్ల వరకు వేలం వేయాలని భావిస్తున్నారు.
ఇక అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ లిమిటెడ్ అత్యధిక ప్రీ వేలం డిపాజిట్ ని చెల్లించింది. ఇదే సమయంలో అదానీ డేటా
నెట్ వర్క్స్ లిమిటెడ్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అంబానీ, అదానీ, మిట్టల్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
Also Read : వోక్స్వ్యాగన్ సిఇఓ తొలగింపు