Mukesh Ambani : 2023 కల్లా దేశ వ్యాప్తంగా 5జీ సేవలు – అంబానీ
సంచలన ప్రకటన చేసిన రిలయన్స్ చైర్మన్
Mukesh Ambani : రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) సంచలన ప్రకటన చేశారు. 2023 డిసెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా 5జీ టెక్నాలజీ సేవలు అందజేస్తామని వెల్లడించారు.
ఇప్పటికే టెలికాం పరంగా టాప్ లో కొనసాగుతోంది రిలయన్స్ జియో సంస్థ. దేశంలోని ప్రతి మూలన కవర్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతానికి అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందజేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు ముకేశ్ అంబానీ.
ఇదిలా ఉండగా రిలయన్స్ జియో సెప్టెంబర్ 2016లో టెలికాం రంగంలోకి ప్రవేశించింది. ఉచిత వాయిస్ కాల్స్ , చౌక డేటాను అందజేస్తోంది. సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులో ఉండేలా 5జీ సేవలు అందిస్తామని చెప్పారు ముకేశ్ అంబానీ.
శనివారం దేశ రాజధాని న్యూఢిల్లి లోని ప్రగతి మైదాన్ లో ఇండియన్ కాంగ్రెస్ మొబైల్ ఈవెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. టెలికాం రంగాలన్నీ ఇందులో పాలు పంచుకున్నాయి.
ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ 2024 లోపు 5జీ సేవలు అందజేస్తామని ప్రకటించగా రిలయన్స్ జియో అంతకంటే ముందే తాము 5జీ సేవలను అందజేస్తామని వెల్లడించడం విశేషం. తన వార్షిక వాటాదారుల సమావేశంలో మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై , చెన్నై, కోల్ కతా లలో దీపావళి నాటికి 5జీ సర్వీసులు ఇస్తామన్నారు.
5జీ సర్వీసుల వల్ల మరింత ఆర్థిక పురోగతి సాధించేందుకు వీలు కలుగుతుందన్నారు. అన్ని రంగాలకు ఇది చోదక శక్తిగా పని చేస్తుందని చెప్పడంలో తాను సందేహించడం లేదన్నారు రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్.
Also Read : సెప్టెంబర్ లో జీఎస్టీతో రూ. 1.47 లక్షల కోట్లు