5G Spectrum Auction : మూడో రోజుకి చేరిన 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం

రూ. 1.5 ట్రిలియ‌న్ల విలువైన బిడ్

5G Spectrum Auction : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న 5జీ టెలికాం స్పెక్ట్ర‌మ్ వేలం రెండో రోజు ముగిసింది. గురువారం రోజు కూడా వేలం పాట జ‌ర‌గ‌నుంది. ఇక రెండో రోజు ముగిసే స‌మ‌యానికి రూ. 1,49,454 కోట్ల విలువైన బిడ్ ల‌ను పొందింది.

ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్న ఈ వేలం పాటు మ‌రో రోజుకు పొడిగించింది కేంద్ర స‌ర్కార్. 2021 నాటి 4జీ స్పెక్ట్ర‌మ్ వేలం కంటే 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం రూ. 71,639.2 కోట్లు ఎక్కువ‌గా ఉంది.

గ‌తంలో కంటే ఈసారి జ‌రిగిన బిడ్ వేలం శాతంగా చూస్తే 92.06 శాతం ఎక్కువ‌. నిన్న జ‌రిగిన ఐదు రౌండ్లు లో మొత్తం తొమ్మిదికి చేరుకుంది. 27నే పూర్త‌వుతుంద‌ని భావించారు.

కానీ ఇంకా కొన‌సాగుతోంది వేలం పాట‌. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన బిడ్ లు 2021 లో 4జీ వేలం కోసం అందిన మొత్తం కంటే దాదాపు రెట్టింపు. మార్చి 2021లో జ‌రిగిన 4జీ స్పెక్ట్ర‌మ్ వేలం రూ. 77,814. 80 ప‌లికింది.

గ‌త ఏడాది నిర్వ‌హించిన బిడ్ రెండు రోజుల్లోనే ముగిసింది. కానీ ఈసారి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వేలం పాట‌కు సంబంధించిన వివ‌రాల‌ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ వెల్ల‌డించారు.

700 మెగా హెర్ట్స్ కి మంచి స్పందన వ‌చ్చింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గం ఇటీవ‌ల టెలిక‌మ్యూనికేష‌న్స్ శాఖ (డీఓటీ) 5 జీ స్పెక్ట్ర‌మ్ వేలానికి(5G Spectrum Auction) ఆమోదం తెలిపింది.

దీని ద్వారా ప్ర‌జ‌ల‌కు, సంస్థ‌ల‌కు 5జీ సేవ‌ల‌ను అందించేందుకు బిడ్డ‌ర్ల‌కు స్పెక్ట్ర‌మ్ కేటాయిస్తారు. 5జీ అనేది ఐదో త‌రం మొబైల్ నెట్ వ‌ర్క్. ఇది చాలా వేగ‌వంత‌మైన డేటాను ప్ర‌సారం చేస్తుంది.

Also Read : ‘అర్పిత’ ఫ్లాట్ లో రూ. 29 కోట్లు..5 కేజీల బంగారం

Leave A Reply

Your Email Id will not be published!