Independence Day : స్వతంత్ర భారతమా జయహో
- మేరా భారత్ మహాన్
Independence Day : ఇవాళ మనందరం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేస్తాం. ఆంగ్లేయుల పాలనపై భారత దేశం సాధించిన విజయమే ఈ దినోత్సవం.
వందల ఏళ్ల బానిసత్వం నుంచి దేశం విముక్త పొందింది. దానికి గుర్తుగా స్వాతంత్రం వచ్చిన అనంతరం కేంద్ర ప్రభుత్వం పంధ్రాగస్టును స్వాతంత్ర దినోత్సవంగా, జాతీయ సెలవు దినంగా ప్రకటించింది.
1947 సంవత్సరం నుంచి నేటి 2022 దాకా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అఖండ భారత దేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ వచ్చారు.
చివరకు యావత్ దేశం వారి కబంధ హస్తాల్లోకి వెళ్లి పోయింది. ఆనాడు రాజ్యాలు ఉండేవి. వాటిని జయిస్తూ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 19వ శతాబ్ధం నాటికి పూర్తిగా ఆంగ్లేయుల చేతుల్లో బందీ అయి పోయింది భారత దేశం.
1858 వరకూ భారత దేశ సార్వ భౌమాధికారం మొఘల్ పరిపాకులే ఉన్నా రాను రాను వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది. 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది.
దానిలో సిపాయిలు, రాజులు ఓడి పోయారు. 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యానికి అధినేత్రి అయ్యారు. ఆనాటి నుంచి భారత దేశం ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చింది.
బ్రిటీష్ పరిపాలన నుంచి దేశానికి స్వేచ్ఛ కావాలని కోరుతూ అనేక రకాలుగా పోరాటలు జరిగాయి. ఎందరో దేశ భక్తులు పాల్గొన్నారు. ప్రాణాలు అర్పించారు. త్యాగాలు చేశారు.
ఆంగ్లేయుల రాచరిక పాలనలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తమ ప్రాణాలను దేశం కోసం పణంగా పెట్టారు. వందేమాతరం నినాదం మిన్నంటింది. దేశాన్ని అట్టుడికించింది.
భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీశారు. జనరల్ డయ్యర్ పాశవిక చర్య భారతీయులను ఆగ్రహానికి తెప్పించింది. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ..ఇలా ఎందరో స్వాతంత్ర పోరాటానికి ఊపిరి పోశారు.
గాంధీ సారథ్యంలో దేశ విముక్తి కోసం పోరాటం చోటు చేసుకుంది. చివరకు ఆంగ్లేయులు దిగిరాక తప్పలేదు. అఖండ భారత దేశాన్ని రెండుగా విభజించారు.
ఒకటి పాకిస్తాన్ గా రెండోది భారత దేశంగా విడి పోయింది. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది.
ఆనాటి స్వేచ్ఛకు గుర్తుగా ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. ఈ సందర్భంగా మనం దేశ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అన్న మాటల్ని గుర్తు చేసుకోవాలి.
ప్రపంచం నిద్రలోకి జారుకున్న సమయంలో భారత దేశానికి స్వేచ్చ లభించిందన్నారు. ఈ దేశం శాంతికి, సౌభ్రాతృత్వానికి, సామరస్యానికి, లౌకిక వాదానికి ప్రతీక అని పేర్కొన్నారు.
అవును..మేరా భారత్ మహాన్ అంటూ మనం దేశానికి ప్రణమిల్లుదాం.
Also Read : భారత దేశం ప్రజాస్వామ్యానికి మార్గం