Rahul Dravid : బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడి పోయాం – ద్రవిడ్
అయినా ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆట తీరు అద్భుతం
Rahul Dravid : ఇంగ్లండ్ తో జరిగిన రీ షెడ్యూల్ ఐదో మ్యాచ్ లో ఊహించని రీతిలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు భారత జట్టుకు షాక్ ఇచ్చింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
ప్రధానంగా స్టార్ ఆటగాళ్లు జో రూట్ , బెయిర్ స్టో దుమ్ము రేపారు. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) మీడియాతో మాట్లాడారు. ఇంగ్లండ్ జట్టు అద్బుతంగా ఆడిందని కితాబు ఇచ్చాడు.
ఇదే సమయంలో భారత జట్టు సరైన రీతిలో బ్యాటింగ్ లో రాణించ లేదని పేర్కొన్నాడు. ఇంకా మరికొన్ని పరుగులు రెండో ఇన్నింగ్స్ లో సాధించి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు.
బౌలర్లు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టడి చేశారని, కానీ రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా తప్ప మిగతా వాళ్లు అంతగా ప్రభావం చూప లేక పోయారని ఒప్పుకున్నాడు.
కానీ పిచ్ కూడా రాను రాను బ్యాటర్లకు అనుకూలంగా మారిందని ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదన్నాడు రాహుల్ ద్రవిడ్. ఒక రకంగా టెస్టు మ్యాచ్ ను ఐదు రోజుల పాటు ఆడడం వల్ల కొంత మేలు జరిగిందని స్పష్టం చేశాడు.
ప్రధానంగా భారత బౌలర్లను ధాటిగా ఆడిన జో రూట్ , బెయిర్ స్టోల వల్లే కొంప మునిగిందన్నాడు. మూడు రోజుల పాటు ఆట భారత జట్టు చేతిలో ఉందన్నాడు.
కానీ నాలుగు, ఐదో రోజు మాత్రం మ్యాచ్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లి పోయిందన్నాడు రాహుల్ ద్రవిడ్.
Also Read : ఇంగ్లండ్ సెన్సేషన్ విక్టరీ సీరీస్ సమం