Justice HP Sandesh : నేను రైతు బిడ్డను రూ. 50తో బతకగలను
జస్టిస్ హేతూరు పుట్టస్వామి గౌడ్ సందేశ్
Justice HP Sandesh : ఈ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉందని నిరూపించారు కర్ణాటకకు చెందిన జస్టిస్ హెచ్ పి సందేశ్(Justice HP Sandesh) . ఆయన పూర్తి పేరు హేతూరు పుట్ట స్వామి గౌడ సందేశ్. హసన్ జిల్లా సకలేష్ పూర్ తాలూకా లోని హేతూరులో 2 డిసెంబర్ 1964లో పుట్టారు.
తల్లిదండ్రులు రైతు కుటుంబానికి చెందిన వారు. హేతుర్ , సకలేష్ పూర్ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. సకలేష్ పూర్ లోని ప్రీ
యూనివర్శిటీ ప్రభుత్వ కాలేజీలో మాధ్యమిక విద్యను చదివారు.
1987 నుండి 1992 దాకా ఎం. కృష్ణ లా కాలేజ్ , మైసూర్ యూనివర్శిటీ నుంచి 5 ఏళ్ల లా డిగ్రీ పొందారు. హసన్ లోని సివిల్ , క్రిమినల్ లా
రెండింటిపై సీనియర్ న్యాయవాది కె. అనంత రామయ్యతో ప్రాక్టీస్ ప్రారంభించారు.
1994లో తన ప్రాక్టీస్ ను బెంగళూరుకు మార్చారు. హైకోర్టు, జిల్లా న్యాయ వ్యవస్థలో సివిల్, క్రిమినల్ పక్షంలో ప్రాక్టీస్ చేశారు. 2002లో నేరుగా జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు.
ఫస్ట్ క్లాస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ , సెషన్స్ జడ్జి , మాండ్యా, మంగళూరులో పని చేశారు. ప్రధాన న్యాయమూర్తికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కర్ణాటక హైకోర్టులో పరిపాలన విభాగంలో రిజిస్ట్రార్ గా పనిచేశారు హెచ్ పి సందేశ్(Justice HP Sandesh) .
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ , సెషన్స్ జడ్జీగా పని చేశారు. మైసూర్ , హవేరి, రిజిస్ట్రార్ (మౌలిక సదుపాయాలు) గా పని చేశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. రిజస్ట్రార్ విజిలెన్స్ విభాగంలో ఉన్నారు.
కర్ణాటక హైకోర్టులో అదనపు హోదా న్యాయమూర్తిగా పని చేశారు. 26 ఫిబ్రవరి 2020న శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సందేశ్ కు
ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఒకరు సహనా సందేశ్. ఆమె ఇంజనీర్ గ్రాడ్యూయేట్ , స్నేహా సందేశ్ ఎంబీబీఎస్ చదువుతోంది. ఎంఎస్ రామయ్య మెడికల్
కాలేజీలో ఇంటర్నిషిప్ చేస్తోంది.
ఇదిలా ఉండగా న్యాయమూర్తి హెచ్ పి సందేశ్ సంచలనంగా మారారు. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశారు. ఈ సందర్బంగా జడ్జి
ఏసీబీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
అవినీతిని నిర్మూలించాల్సిన ఏసీబీ దానికే కేరాఫ్ గా మారిందన్నారు. ఆపై తాను రైతు కొడుకునని రూ. 50 తో కూడా బతకగలనన్నాడు.
Also Read : ఏసీబీపై సీరియస్ జడ్జికి వార్నింగ్