ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో జో రూట్ టాప్
ఐదో ప్లేస్ లో రిషబ్ పంత్ దిగజరాని కోహ్లీ ర్యాంక్
ICC Test Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings) బుధవారం విడుదల చేసింది. స్వదేశంలో న్యూజిలాండ్, భారత్ జట్లతో జరిగిన టెస్టుల్లో దంచి కొట్టాడు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్.
ఏకంగా రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో భారత బౌలర్లను ఉతికి ఆరేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 142 రన్స్ చేసి తన జట్టుకు ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఒకానొక దశలో అసాధ్యం అనుకున్న టార్గెట్ ను జానీ బెయిర్ స్టో తో కలిసి అవలీలగా ఛేదించారు. దీంతో తాజా ర్యాంకింగ్స్ లో జో రూట్ టాపర్ గా నిలిచాడు.
ఇప్పటికే అత్యంత వేగవంతంగా 10,000 పరుగులు కూడా పూర్తి చేశాడు. నాలుగు దశాబ్దాల తర్వాత ఈ పరుగుల్ని చేయడం రూట్ కే చెల్లింది.
ఇక ర్యాంకుల(ICC Test Rankings) విషయానికి వస్తే రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్ ఉండగా మూడో ప్లేస్ లో ఇదే కంట్రీకి చెందిన స్టీవ్ స్మిత్ నిలిచాడు.
ఇక నిన్నటి దాకా టాప్ లో ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంతో సరి పెట్టుకున్నాడు. ఆఖరి టెస్టులో సెంచరీతో పాటు రెండో ఇన్సింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన రిషబ్ పంత్ (Rishab Pant) ఐదో స్థానానికి ఎగబాకాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆరో స్థానంలో కొనసాగుతుండగా ఉస్మాన్ ఖవాజా ఏడో ప్లేస్ లో ఉన్నాడు. 8వ స్థానంలో శ్రీలంకకు చెందిన దిముత్ కరుణ రత్నె , 9వ స్థానంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, 10వ స్థానంలో జానీ బెయిర్ స్టో నిలిచారు.
Also Read : భారత బౌలర్లపై మంజ్రేకర్ ఫైర్