Shikhar Dhawan : శిఖర్ ధావన్ బన్ గయా వన్డే జట్టు కెప్టెన్
విండీస్ తో సీరీస్ కు జట్టు డిక్లేర్
Shikhar Dhawan : ప్రపంచ క్రికెట్ లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఉన్నంత క్రేజ్ ఇంకే క్రీడా సంస్థకు లేదంటే నమ్మలేం. బహుషా బీసీసీఐ మార్చినట్లు కెప్టెన్లను ఏ దేశం మార్చలేదు.
ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ తరుణంలో లెక్కకు మించిన ఆటగాళ్లు అందుబాటులో ఉండడంతో
ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కత్తి మీద సాము లాగా మారింది.
తాజాగా కేవలం ఒకే ఒక్క టి20 మ్యాచ్ కు స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో దిగి
వచ్చింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. బుధవారం బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు స్టార్ వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) కు కెప్టెన్ గా చాన్స్ ఇచ్చింది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన సీరీస్ కు అతడిని
ఎంపిక చేసింది. ప్రస్తుతానికి విండీస్ జట్టు వన్డేలు, టి20 మ్యాచ్ లు ఆడనుంది.
తాజాగా 16 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును డిక్లేర్ చేసింది బీసీసీఐ. ఐపీఎల్ లో సీఎస్కే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన
రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్ దక్కింది.
ఐర్లాండ్ లో అదరగొట్టిన దీపక్ హూడా, సంజూ శాంసన్ కు చోటు కల్పించారు. జూలై 22న ఫస్ట్ వన్డే, 24న రెండో వన్డే , 27న మూడో వన్డే ఆడుతుంది. ఇక టి20 సీరీస్ లో భాగంగా మొదటి టి20 మ్యాచ్ జూలై 29న, రెండో టీ20 ఆగస్టు 1న జరుగుతుంది.
మూడో టీ20 మ్యాచ్ ఆగస్టు 2న, నాలుగో టి20 మ్యాచ్ ఆగస్టు 6న, ఐదో టి20 మ్యాచ్ ఆగస్టు 7న నిర్వహిస్తారు. ఇక జట్టు పరంగా చూస్తే ఇలా ఉంది.
శిఖర్ ధావన్ కెప్టెన్. జడేజా వైస్ కెప్టెన్ . రుతురాజ్ గైక్వాడ్ , గిల్ , హూడా, సూర్య కుమార్, శ్రేయస్ , ఇషాన్ కిషన్ , సంజూ శాంసన్ , ఠాకూర్ ,
చహల్ , పటేల్ , అవేశ్ ఖాన్ , ప్రసిద్ కృష్ణ, సిరాజ్ , ఆర్ష్ దీప్ ఉన్నారు.
Also Read : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో జో రూట్ టాప్
#TeamIndia ODI squad:
Shikhar Dhawan (C), Ravindra Jadeja (VC), Ruturaj Gaikwad, Shubman Gill, Deepak Hooda, Suryakumar Yadav, Shreyas Iyer, Ishan Kishan (WK), Sanju Samson (WK), Shardul Thakur, Yuzvendra Chahal, Axar Patel, Avesh Khan, Prasidh Krishna, Mohd Siraj, Arshdeep Singh— BCCI (@BCCI) July 6, 2022