Virat Kohli : రాణిస్తేనే కోహ్లీకి చాన్స్ లేదంటే కష్టం
గత కొంత కాలంగా పూర్ పర్ ఫార్మెన్స్
Virat Kohli : భారత క్రికెట్ జట్టుకు ఎనలేని విజయాలు సంపాదించి పెట్టిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఇంగ్లండ్ టూర్ సమయంలోనే తప్పుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
ఆ తర్వాత ఐపీఎల్ దుబాయ్ లో జరిగినప్పుడే డిక్లేర్ చేశాడు. ఇక బీసీసీఐ సందింట్లో సడేమియా అన్నట్లు మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టి20) నుంచి విరాట్ కోహ్లీని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించేశారు.
ఆ మధ్య తనను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశాడు కోహ్లీ. దేశ వ్యాప్తంగా అది పెద్ద రాద్ధాంతానికి దారి తీసింది.
ఇదే సమయంలో భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాస్ సౌరవ్ గంగూలీ తాను ఫోన్ కూడా చేశానని చెప్పాడు.
ఇక గత రెండు సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ నుంచి అసలైన ఇన్నింగ్స్ చూడలేదు ఫ్యాన్స్. అడపా దడపా కొన్ని రన్స్ చేయడమే తప్పా ప్రభావంతమైన రీతిలో ఆడడం లేదు.
ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్ లో ఉన్న కోహ్లీ(Virat Kohli) పరిస్థితి దారుణంగా ఉంది. ఈ టీ20 సీరీస్ లో రాణిస్తేనే కోహ్లీని కొనసాగిస్తారని లేక పోతే పక్కన పెడతారన్న ప్రచారం జోరందుకుంది.
బీసీసీఐ(BCCI) సెలెక్షన్ కమిటీ క్రికెటర్ల ఎంపిక విషయంలో వాళ్ల ఆట తీరు ఆధారంగానే ఎంపిక చేస్తారు తప్ప వాళ్లకు ఉన్న అభిమానుల ఆదరణను చూసి ఎంపిక చేయరని బీసీసీఐకి చెందిన ఒకరు కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది.
Also Read : ‘పయోలీ ఎక్స్ ప్రెస్’ వెరీ వెరీ స్పెషల్