Krishna Teja : యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీపై సర్కార్ వివక్ష
కాలయాపన చేసేందుకే కమిటీ ఏర్పాటు
Krishna Teja : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో అనుసరిస్తున్న తాత్సారాన్ని తీవ్రంగా తప్పు పట్టారు టీపీసీసీ అధికార ప్రతినిధి క్రిష్ణ తేజ(Krishna Teja)
రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలలో లెక్కలేనన్ని బోధన, బోధనేతర పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఈరోజు వరకు వాటి గురించి ఊసెత్తడం లేదని పేర్కొన్నారు.
అన్ని యూనివర్శిటీలకు కలిపి ఎంపిక కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. శుక్రవారం క్రిష్ణ తేజ(Krishna Teja) కీలక ప్రకటన చేశారు.
ఏ యూనివర్శిటీకి ఆ యూనివర్శిటీనే భర్తీ చేసుకునే విధంగా ఉంటే ఇంత ఆలస్యం జరిగి ఉండేది కాదని అభిప్రాయ పడ్డారు. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం అదిగో పోస్టులు వస్తాయని చెప్పడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించక పోవడం, అందుకు తగిన రీతిలో విశ్వ విద్యాలయాలలో టీచింగ్, నాన్ టీచింగ్ కొలువుల్ని భర్తీలో శ్రద్ద
పెట్టక పోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
నాణ్యమైన విద్య అందాలంటే తప్పనిసరిగా టీచింగ్ స్టాఫ్ ఉండాలన్నారు. ప్రభుత్వం ఎప్పటి లోగా పోస్టులను భర్తీ చేస్తుందో రాష్ట్ర ప్రజలకు
తెలియ చేయాలని క్రిష్ణ తేజ డిమాండ్ చేశారు.
తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలకు కలిపి పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే పేర్కొందని తెలిపింది. ఇన్నేళ్లయినా ఎందుకు పూర్తి కాలపు సిబ్బందిని నియమించ లేక పోయారో చెప్పాలన్నారు.
100 ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూలో 2,075 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ యూనివర్శిటీకి 3,209 పోస్టులు మంజూరైతే 1,134 మంది
మాత్రమే పని చేస్తున్నారని వెల్లడించారు.
కాకతీయ యూనివర్శిటీలో 174, తెలంగాణలో 9, మహాత్మా గాంధీలో 9, శాతవాహన యూనివర్శిటీలో 58 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు.
పాలమూరు 14, పీఎస్టీయూ లో 84, బీఆర్ఏఓయూలో 90, జేఎన్టీయూహెచ్ లో 115, ఆర్జీయూ కేటీలో 93 ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు క్రిష్ణ తేజ్. మొత్తం 2, 774 పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : క్లియరెన్స్ సరే జాబ్స్ భర్తీ మాటేంటి