Farmers Fire : పోడు భూముల కోసం అడవి బిడ్డల పోరాటం
పోడు భూములపై హక్కు కోసం పోరు
Farmers Fire : తెలంగాణలో పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. భూమిపై హక్కు తమకు ఉందని వారంటున్నారు. స్పెషల్ ఫోర్స్ ను ప్రయోగించి తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పోడు భూములు లెక్కలు తేలుస్తానంటూ ప్రకటించిన సీఎం తమపై దాడులు చేస్తున్నా ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ప్రశ్నించారు. తమకు కూడు, గూడు లేకుండా చేస్తున్నారంటూ వాపోయారు.
ఆడవాళ్లమని చూడకుండా , వంటిపై దుస్తులు ఊడి పోతున్నా పట్టించుకోకుండా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే అని బాధితులు ప్రశ్నించారు.
ఇందు కోసమేనా తాము పోరాటం చేసిందంటూ నిలదీశారు. ఎక్కడికక్కడ పోలీసు జులుం ప్రదర్శిస్తున్నారని , ఇది మంచి పద్దతి కాదంటున్నారు. చంటి పిల్లల తల్లులని చూడకుండా జైళ్లో పెట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనాది నుంచి అడవినే నమ్ముకున్న తమకు (ఆదివాసీలు) నిలువ నీడ లేకుండా చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు బాధితులు. ఇదిలా ఉండగా వీరిపై దాడులకు తెగ బడటాన్ని వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
ఆడబిడ్డలపై, ఆదివాసీలపై దాడులకు తెగ బడతారా అని ఫైర్(Farmers Fire) అయ్యారు. నయా నిజాం నిరంకుశ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు షర్మిల.
ఇది మీ పాలనకు ముగింపు పలకడం ఖాయమని జోష్యం చెప్పారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ సర్కార్ కు పోయే కాలం వచ్చిందన్నారు.
Also Read : బాబు పని ఖతం ఓటమి ఖాయం
పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్..
స్పెషల్ ఫోర్స్ ను పెట్టి మరీ ఆదివాసీల గుడిసెలు పీకేపిస్తున్నాడు. వాట్ ఇస్ వాట్.. వాట్ ఇస్ నాట్ ..
కుర్చీ వేసుకొని మరి పోడు భూముల లెక్క తేల్చుతా అని, ఈరోజు వాళ్లకు నీడ – గూడు లేకుండా..
ఆడవాళ్ళు అని చూడకుండా ఒంటి మీది గుడ్డలు ఊడిపోతున్నా,
1/2 pic.twitter.com/Nhk7aCofEW— YS Sharmila (@realyssharmila) July 9, 2022