Karsan Ghavri : పేరు మీద నెట్టుకు రావడం కష్టం – ఘవ్రీ
కోహ్లీపై మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
Karsan Ghavri : విరాట్ కోహ్లీ పూర్ పర్ ఫర్మార్మెన్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంత కాలం నుంచి పరుగులు తీసేందుకు నానా తంటాలు పడుతున్నాడు కోహ్లీ. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ కొనసాగనుంది.
ఇందులో పాల్గొనే భారత జట్టులో కోహ్లీకి స్థానం దొరుకుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది. ప్రపంచంలోనే టాప్ బ్యాటర్ గా పేరొందిన ఈ దిగ్గజ క్రికెటర్ గతంలో ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఈ తరుణంలో కోహ్లీకి అగ్ని పరీక్షగా మారింది ఇంగ్లాండ్ టూర్. ఏ మాత్రం రాణించక పోయినా బీసీసీఐ వేటు వేయడం తప్పదు. కోహ్లీ ఎదుర్కొంటున్న పరిస్థితిపై స్పందించాడు కర్సన్ ఘవ్రీ(Karsan Ghavri).
ఇలా ఎంత కాలం తనకు ఉన్న పేరు మీద నెట్టుకు వస్తాడని ప్రశ్నించాడు. ఏ జట్టులోనైనా బాగా ఆడే వారిని మాత్రమే కోరుకుంటారని, వాళ్లకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఎంపిక చేయడం అన్నది ఉండదని స్పష్టం చేశాడు.
తన స్థానం నిలబెట్టు కోవాలంటే కోహ్లీ తప్పనిసరిగా ఆడాల్సి ఉంటుందన్నాడు. లేక పోతే భారత జట్టులో ప్లేస్ దొరకడం కష్టమేనని పేర్కొన్నాడు ఘవ్రీ.
ఇతరుల నుండి విమర్శలు ఎదుర్కోక ముందే కొంత కాలం పాటు విరామం తీసుకోవడం ఉత్తమమని సూచించాడు. విరాట్ గొప్ప ప్లేయర్ . కానీ అతడు తన పేరు మీద ఎంత కాలం రాణించగలడని ప్రశ్నించాడు ఘవ్రీ(Karsan Ghavri).
ఏ మాత్రం ఫామ్ లోకి వచ్చినా కోహ్లీని తట్టుకోవడం కష్టమని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారంటూ ప్రశంసించారు.
Also Read : భారత్ తో ఆడేందుకు జింబాబ్వే సిద్దం