Sri Lanka Protest : ముదిరిన సంక్షోభం పెల్లుబికిన ప్రజాగ్రహం
ప్రాణభయంతో పారి పోయిన ప్రెసిడెంట్
Sri Lanka Protest : శ్రీలంకలో సంక్షోభం ముదిరింది. మరింత తీవ్రతరం కావడంతో జనం రోడ్డెక్కారు. గత కొంత కాలంగా నిరసనలు, ఆందోళనలు చేస్తూ వచ్చారు.
కానీ ఆహారం, పెట్రోల్, డీజిల్ కొరత, ద్రవ్యోల్బణం మరింత అధికం కావడం, దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సె బాధ్యతా రాహిత్యం చివరకు తనంతకు తానుగా పారి పోయేలా చేసింది.
ప్రజాగ్రహానికి ఏకంగా ప్రెసిడెంట్ పారి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిరసనకారులు వేలాదిగా తరలి వచ్చారు. అధ్యక్షుడి భవనాన్ని ముట్టడించారు. భవనం లోపలికి చొచ్చుకు పోయారు.
చివరకు తనంతకు తానుగా భారీ సెక్యూరిటీ మధ్య భవనం వెనుక నుండి బిక్కుబిక్కుమంటూ ప్రాణ భయంతో పరారు కావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు.
జనం ఆవేవాన్ని చల్లార్చేందుకు ప్రధాన మంత్రి పదవిలో రణిలె విక్రమ సింఘెను నియమించినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించ లేదు.
పోలీసులు నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వెల్లువలా జనం సంద్రమై కదిలి వచ్చారు. కాల్పులకు తెగబడినా బెదరలేదు.
నేరుగా గేట్లను తోసుకుని అధ్యక్షుడి భవనం లోపలోకి వెళ్లారు. ఒక రకంగా లాంగ్ మార్చ్ ను తలపింప చేసింది వీరి ప్రజల ఆందోళన.
పోలీస్ లు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించుకుని వచ్చారు.ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంకలో(Sri Lanka Protest) ఆవేశం ఎలా ఉంటుందో ప్రత్యక్ష ఉదాహరణ ఇది.
పరిస్థితి ముందుగానే పసిగట్టిన ఆర్మీ ప్రెసిడెంట్ ను ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. విచిత్రం ఏమిటంటే రాజపక్సె వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఇందులో పోలీసులు కూడా ఉండడం విశేషం.
Also Read : పారిపోయిన శ్రీలంక ప్రెసిడెంట్