Sri Lanka Lesson : తూటాలు..రాజ సౌధాలు ఆదుకోవు
ప్రజలే పాలకులు వారే రాజులు
Sri Lanka Lesson : అందమైన భవంతులు. అద్భుతమైన వసతులు, సౌకర్యాలు. చిటికె వేస్తే వచ్చి వాలి పోయే మనుషులు. చేతిలో పవర్ ఉంది కదా అని రెచ్చి పోతే శ్రీలంక లాగే అవుతుంది.
ప్రజలే పాలకులు వారే రాజులు. ప్రజా ప్రతినిధులు సేవకులు మాత్రమే. కానీ తాము అసలైన సేవకులమన్న సంగతి మరిచి పోతే
రాచరికం మదిలో మెదులుతుంది.
ఆరోజు జనం ఆగ్రహానికి మసి కావాల్సిందే. మాడి పోవాల్సిందే. మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలు..సౌకర్యవంతంగా ఉండేందుకు ఉపయోగించు కుంటున్న పోలీసులు, రక్షణ కవచాలు, కోర్టులు, కార్యాలయాలు, రాజ భవంతులు, కళ్లు మిరిమిట్లు గొలిపే వాహనాలు ఏవీ పని చేయవు.
అవి తాత్కాలికం మాత్రమే అనుకోవాలి. జనం కోసం , దేశం కోసం పని చేస్తే అదే ప్రజలు పూజిస్తారు. వాళ్లకు తలవంచి సలాం చేస్తారు. లేదంటే పాతరేస్తారు. పాతి పెడతారు.
నిన్నటి దాకా రాచరికపు మదంతో పదవీ కాంక్షతో అడ్డగోలు నిర్ణయాలతో శ్రీలంక దేశాన్ని సర్వ నాశనం చేసిన ప్రెసిడెంట్ గోటబోయ రాజపక్సే, ప్రధానమంత్రిగా పదవిని అనుభవించిన మహీంద్ర రాజపక్సే ఇవాళ ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటున్నారు.
ప్రాణ భయంతో చివరకు దేశం కోసం ఏర్పాటు చేసుకున్న ఆర్మీ గుప్పిట్లో తలదాచు కోవాల్సిన పరిస్థితి దాపురించింది. వీరు
చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకోక తప్పదు.
ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే వారెవరైనా సరే వీరిని చూసి నేర్చుకోవాలి. అది ప్రధాన మంత్రి మోదీకి వర్తిస్తుంది..అమెరికా
దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ కు వర్తిస్తుంది.
రాజ్యమంటే ప్రజలు..కానీ పోలీసులు..రాజభవంతులు అలంకార ప్రాయం మాత్రమే. తస్మాత్ జాగ్రత్త. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని
గుర్తించిన రోజున పరిఢవిల్లుతుంది.
నియంతృత్వ పోకడలతో , తమకు ఎదురే లేదని విర్రవీగితే ఏదో ఒకరు జనాగ్రహానికి గురికాక తప్పదు. తలవంచక తప్పదు. ఆరోజున ఏ
పాలకులు, ఏ తుపాకులు, ఏ తూటాలు, ఏ మిస్సైళ్లు..ఏ రాకెట్లు ఆదుకోలేవని గుర్తిస్తే మంచిది.
ఇక నుంచైనా శ్రీలంకను(Sri Lanka Lesson) చూసి నేర్చుకోవాలి భారతీయ పాలకులు. లేక పోతే వారికి పట్టిన గతే మనకు పడుతుందని గుర్తిస్తే బెటర్.
Also Read : శ్రీలంక సంక్షోభం భారత్ కు గుణపాఠం