Sanath Jayasuriya : రాజసౌధం కూలింది ‘రాజ‌ప‌క్సే’ ఇక దిగు

నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్ జ‌యసూర్య‌

Sanath Jayasuriya : శ్రీ‌లంక ప్ర‌జ‌ల‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేం. ప్ర‌ధానంగా ఆ దేశానికి చెందిన క్రికెట‌ర్లు. మ‌న భార‌త దేశంలోని క్రికెట‌ర్ల‌కు ఒకింత దేశం కంటే ఆట‌, కాసుల‌పైనే ఎక్కువ‌.

విచిత్రం ఏమిటంటే క‌రోనా సాకుతో ఇంగ్లండ్ టూర్ లో షెడ్యూల్ ప్ర‌కారంగా ఆడాల్సిన ఐదో టెస్టును 2021లో కేవ‌లం ఐపీఎల్ లో ఆడేందుకు దుబాయ్ కి చెక్కేసిన ఘ‌న‌త మ‌నోళ్ల‌ది.

కానీ శ్రీ‌లంక మాజీ క్రికెట‌ర్ల‌ను మెచ్చు కోవాల్సిందే. వారికి స‌లాం చేయాల్సిందే. మాజీ ఓపెన‌ర్ , మాజీ శ్రీ‌లంక(SriLanka) సెలెక్ట‌ర్ రోష‌న్ మ‌హ‌నామా అయితే త‌న దేశంలోని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు.

తానే స్వ‌యంగా బ్రెడ్లు, టీ, కాఫీ అందించి ఆక‌లి తీర్చారు. తాజాగా శ్రీ‌లంక ప్రెసిడెంట్ గోట‌బోయ రాజ‌ప‌క్సే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ వేలాది మంది త‌ర‌లి వ‌చ్చారు.

రాజ‌ధాని కొలంబోలో కొలువు తీరిన ప్రెసిడెంట్ భ‌వ‌నాన్ని ముట్ట‌డించారు. జ‌నం వెల్లువ‌లా త‌ర‌లి రావ‌డంతో భ‌యంతో వెనుక వైపు నుంచి ఆర్మీ స‌హ‌కారంతో దేశాధ్య‌క్షుడు పారి పోయాడు.

ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు చేస్తున్న న్యాయ‌మైరమైన ఆందోళ‌న‌ల‌కు, పోరాటానికి మ‌ద్ద‌తు తెలిపారు

మాజీ క్రికెట‌ర్లు అర్జున ర‌ణ‌తుంగ, ఓపెన‌ర్ స‌న‌త్ జ‌య‌సూర్య‌. ఆయ‌న ఆందోళ‌న బాట ప‌ట్టిన నిర‌స‌నకారుల‌తో క‌లిసి పాల్గొన‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ సంద‌ర్భంగా జ‌య‌సూర్య(Sanath Jayasuriya)  చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది. తమ దేశానికి చెందిన జాతీయ జెండాల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌గా వ‌చ్చారు. ఈ నిర‌స‌న‌ల్లో జ‌య‌సూర్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

వారికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. చేతిలో జెండా ప‌ట్టుకుని నినాదాలు చేశారు. ముట్టడి ప‌రిస‌మాప్త‌మైంది. మీ కోట బురుజులు కుప్ప కూలాయి. ఇక నైనా రాజీనామా చేయి అంటూ పిలుపునిచ్చారు. ఆయ‌న చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

Also Read : తూటాలు..రాజ సౌధాలు ఆదుకోవు

Leave A Reply

Your Email Id will not be published!