Danish Kaneria : విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకుంటే బెట‌ర్

మాజీ క్రికెట‌ర్ డానిష్ క‌నేరియా కామెంట్

Danish Kaneria : ప్ర‌పంచంలోనే టాప్ ప్లేయ‌ర్ గా పేరొందిన భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశ‌లో ఉన్నాడు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నానా తంటాలు ప‌డుతున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సెంచ‌రీ చేసిన దాఖ‌లాలు లేవు. రోజు రోజు ఆట తీరు దారుణంగా ఉంది. ఈ ఏడాది ప్ర‌తిష్టాత్మ‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆస్ట్రేలియా వేదికగా జ‌ర‌గ‌నుంది.

ఇప్ప‌టికే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్ట‌ర్లు ఎంపిక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. చివ‌రి జ‌ట్టును ఎంపిక చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.

టీమిండియాకు ఎంపిక కావాలంటే నానా తంటాలు ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. పెద్ద ఎత్తున యువ ఆట‌గాళ్లు లైన్ లో ఉన్నారు. ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ‌.

కోహ్లీ ఉంటాడో ఉండ‌డోన‌న్న అనుమానం నెల‌కొంది. పేరు గొప్పే కావ‌చ్చు కానీ ఆడ‌కుండా ఉంటే ఎలా ఎంపిక చేస్తారంటూ ప్ర‌శ్నించాడు బీసీసీఐకి చెందిన ఓ అధికారి.

ఈ సంద‌ర్భంగా తాజా మాజీ ఆట‌గాళ్లు కోహ్లీ ఫామ్ తీరుపై కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ డానిష్ క‌నేరియా(Danish Kaneria) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు కోహ్లీపై.

త‌న స్థానాన్ని వ‌దులుకుంటే బెట‌ర్ అని, ఇంకో యువ క్రికెట‌ర్ కు చాన్స్ ఇవ్వాల‌ని సూచించాడు. ఒక ర‌కంగా విరాట్ రెస్ట్ తీసుకోవ‌డం మంచిద‌ని సూచించాడు. ఇదిలా ఉండ‌గా క‌నేరియా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : శ్రీ‌లంక‌..ఆసిస్ టెస్ట్ లో నినాదాలు

Leave A Reply

Your Email Id will not be published!