Novak Djokovic : వింబుల్డ‌న్ టైటిల్ విజేత‌ జొకోవిచ్

కెరీర్ లో 21వ టైటిల్ గెలిచి రికార్డ్

Novak Djokovic : నోవాక్ జొకోవిచ్ చ‌రిత్ర సృష్టించారు. ఏకంగా 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వింబుల్డ‌న్ 2022 గెలుపొందారు. నొవాక్ జొకోవిచ్ నిక్ కిర్గియోస్ ను ఓడించి విజేత‌గా నిలిచాడు. 4-6, 6-3, 6-4, 7-6 తో నిక్ కిర్గియోస్ ను ఓడించి చ‌రిత్ర సృష్టించాడు.

ఆదివారం జ‌రిగిన ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు. త‌న ఏడో వింబుల్డ‌న్ టైటిల్ గెలుపొందాడు. మొత్తం 21గ్రాండ్ స్లామ్ టైటిల్ గా నిలిచాడు.

జ‌కోవిచ్(Novak Djokovic) కి ఇది వ‌రుస‌గా నాలుగో వింబుల్డ‌న్ టైటిల్. ఇదిలా ఉండ‌గా మ్యాచ్ లో భాగంగా జ‌కోవిచ మొద‌టి సెట్ ను కోల్పోయాడు. ఆ త‌ర్వాత రెచ్చి పోయాడు. ప్ర‌త్య‌ర్థి కిర్గియోస్ కు చాన్స్ లేకుండా చేశాడు.

వింబుల్డ‌న్ గెలుపొంద‌డం విశేషం. మొద‌టి నాలుగు గేమ్ లు స‌ర్వ్ తో సాగిన త‌ర్వాత కిర్గియోస్ సెర్బ్ ను బ‌ద్ద‌లు కొట్టాడు. 3-2 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇద్ద‌రు ఆట‌గాళ్లు సెట్ మొత్తంలో స‌ర్వీస్ ను కొన‌సాగించారు.

జ‌కోవిచ్ రెండో సెట్ ప్రారంభంలోనే పై చేయి సాధ‌ఙంచాడు. ఇద్ద‌రు ఆట‌గాళ్లు సెట్ మొత్తంలో స‌ర్వీస్ ను కొన‌సాగించారు. జ‌కోవిచ్ రెండో సెట్ ప్రారంభంలోనే కిర్గియోస్ ను బ‌ద్ద‌లు కొట్టాడు.

ఏకంగా 3-1తో ఆధిక్యంలోకి వెళ్లి చివ‌ర‌కు 6-3తో సెట్ ను కైవ‌సం చేసుకున్నాడు జొకోవిచ‌. జ‌కోవిచ్ కిర్గియోస్ ను బ్రేక్ చేసిన త‌ర్వాత అత‌ని కెరీర్ లో మొద‌టిసారి.

ఇద్ద‌రు ఆట‌గాళ్లు త‌మ స‌ర్వీస్ ల‌ను నిల‌బెట్టుకున్నారు. ఇక మూడో సెట్ 4-4 వ‌ర‌కు స‌ర్వ్ తో కొన‌సాగింది. 5-4 ఆధిక్యాన్ని సాధించాడు. ఆపై సెట్ ను కైవ‌సం చేసుకునేందుకు స‌ర్వీస్ ను కొన‌సాగించాడు.

నాల్గో సెట్ టై బ్రేక‌ర్ వ‌ర‌కు వెళ్ల‌డం ద్వారా గ‌ట్టి పోటీ నెల‌కొంది. కాగా షూటౌట్ లో జోకోవిచ్ 6-1 ఆధిక్యంలోకి వెళ్లాడు.

Also Read : సూర్య సెంచ‌రీ చేసినా త‌ప్ప‌ని ఓట‌మి

Leave A Reply

Your Email Id will not be published!