SL vs AUS 2nd Test : చండీమాల్ సెంచరీ లంక భారీ స్కోర్
నలుగురు ఆటగాళ్లు సత్తా చాటారు
SL vs AUS 2nd Test : ఓ వైపు శ్రీలంక అట్టుడుకుతోంది. కానీ క్రికెట్ మాత్రం కొనసాగుతూనే ఉంది. మరో వైపు శ్రీలంకలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా గాలే వేదికగా రెండో టెస్టు ఆడుతోంది.
ఇందులో భాగంగా ఇవాళ జరిగిన ఇన్నింగ్స్ లో శ్రీలంక(SL vs AUS 2nd Test) బ్యాటర్ దినేశ్ చండీమాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 118 పరుగులతో అజేయ శతకంతో చెలరేగాడు.
ఇక ఆతిథ్య శ్రీలంక జట్టు 67 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాచ్ విషయానికి వస్తే మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్లు నష్ట పోయి 431 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
దినేశ్ చండీమాల్ తో పాటు రమేష్ మెండీస్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చండీమాల్ తో పాటు మరో శ్రీలంక నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు.
దినేష్ చండీమాల్ తో పాటు కరుణ రత్నే సత్తా చాటాడు. 86 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు జట్టు పరంగా. ఇంకో వైపు కుశాల్ మెండీస్ సైతం తానేమీ తక్కువ కాదని నిరూపించాడు.
85 పరుగులు చేశాడు. శ్రీలంక జట్టులో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ఏంజలో మాథ్యూస్ 52 పరుగులు చేసి భారీ స్కోర్ లో పాత్ర పోషించాడు. కమిందు మెండీస్ సైతం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
61 రన్స్ చేసి కీలక భూమిక పోషించాడు. ఇక ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ , నాథన్ లయన్ , మిచెల్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు ఆసిస్ జట్టు స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ , లబూ షేన్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడారు.
స్మిత్ 145 పరుగులతో నాటౌట్ గా ఉంటే లబూషేన్ 104 పరుగులతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో 364 పరుగులకే ఆలౌటైంది.
Also Read : చెల రేగిన మలాన్..లివింగ్ స్టోన్