ICC POTM June Winners : ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ గా స్టో..కాప్

ఫ‌లితాలు ప్ర‌క‌టించిన ఐసీసీ

ICC POTM June Winners : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ కౌన్సిల్ తాజాగా ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును జూన్ నెల‌కు(ICC POTM June Winners) గాను ప్ర‌క‌టించింది. మెన్స్ విభాగంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ జానీ బెయిర్ స్టో టాప్ లో నిలిచాడు.

ఇక మ‌హిళా విభాగంలో ద‌క్షిణాఫ్రికాకు చెందిన మారిజాన్ కాప్ ఎంపిక‌య్యారు. ఇదిలా ఉండ‌గా స్వ‌దేశంలో న్యూజిలాండ్, భార‌త్ జ‌ట్ల‌తో జ‌రిగిన వ‌రుస‌గా జ‌రిగిన నాలుగు టెస్టు మ్యాచ్ ల‌లో దుమ్ము రేపాడు జానీ బెయిర్ స్టో.

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ప్ర‌ధానంగా టీమిండియాతో చెప్పి మరీ కొట్టాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో సెంచ‌రీతో రెచ్చిన బెయిర్ స్టో రెండో ఇన్నింగ్స్ లోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాడు.

దీంతో ప‌రుగుల వ‌ర‌ద పారించిన బెయిర్ స్టో టాపర్ గా నిలిచాడు. ఇదే ఇంగ్లండ్ కు చెందిన మ‌రో హిట్ట‌ర్ , మాజీ కెప్టెన్ అయిన జో రూట్ ను అధిగ‌మించాడు.

ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ రేసులో బెయిర్ స్టో, జో రూట్ మ‌ధ్య పోటీ నెల‌కొంది. కానీ పాయింట్లతో తేడాతో స్టో టాప్ లో నిలిచాడు.

ఇక మ‌హిళ‌ల విభాగానికి వ‌స్తే ఇంగ్లాండ్ తో జ‌రిగిన సీరీస్ లో స‌త్తా చాటింది ద‌క్షిణాఫ్రికాకు చెందిన స్టార్ క్రికెట‌ర్ మారిజాన్ కాప్. ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది.

తొలి ఇన్నింగ్స్ లో కాప్ 150 ప‌రుగులు చేసింది. అంతే కాదు రెండో ఇన్నింగ్స్ లో 43 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచి స‌త్తా చాటింది.

Also Read : ఇంగ్లండ్ తో వ‌న్డేకు కోహ్లీ దూరం

Leave A Reply

Your Email Id will not be published!