YS Jagan : సామాజిక న్యాయం కోసమే మ‌ద్ద‌తు

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు స‌పోర్ట్

YS Jagan : సామాజిక న్యాయం కోస‌మే తాము పార్టీల‌కు అతీతంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి(YS Jagan).

పేద ఆదివాసీ గిరిజ‌న జాతి నుంచి అత్యున్న‌త స్థానానికి పోటీ ప‌డ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఏపీలో ప‌ర్య‌టించారు ద్రౌప‌ది ముర్ము. ఈ సంద‌ర్భంగా ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు వైసీపీ ఎంపీలు.

అనంత‌రం సీఎం దంప‌తులు ద్రౌప‌ది ముర్ముకు జ్ఞాపిక‌ను అంద‌జేశారు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా తొలిసారిగా మ‌హిళ‌కు చాన్స్ ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.

ఇక దేశంలో ఏ రాష్ట్రం చేయ‌ని విధంగా సామాజిక న్యాయాన్ని ఆచ‌ర‌ణ‌లో చూపించిన ఘ‌న‌త త‌మ‌దేన‌న్నారు జ‌గ‌న్ . అందులో భాగంగానే తాము ద్రౌప‌ది ముర్ముకు స‌పోర్ట్ చేశామ‌ని చెప్పారు.

ఇందులో ఎలాంటి రాజ‌కీయం లేద‌న్నారు. రాష్ట్ర‌ప‌తిగా ముర్మును ఎన్ను కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు సీఎం. స‌హృద‌యంతో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బ‌ల‌ప‌ర్చాల‌ని కోరారు.

ఈ సంద‌ర్భంగా దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామి దేవ‌స్థానం పండితులు ద్రౌప‌ది ముర్మును ఆశ్వీర‌చ‌నం ప‌లికారు. ప్ర‌సాదాలు అంద‌జేశారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్య స‌భ స‌భ్యులు వైసీపీకి(YS Jagan) ఉన్నారు.

వీరంతా ద్రౌప‌ది ముర్ముకు ఓటు వేయాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోరారు. ఎలాంటి పొర‌పాటు లేకుండా ఈనెల 18న ప్ర‌తి ఒక్క‌రు ఓటింగ్ లో పాల్గొనాల‌ని సూచించారు ఏపీ సీఎం.

Also Read : ఆగ‌ని వ‌ర్షం అంతటా అప్ర‌మ‌త్తం

Leave A Reply

Your Email Id will not be published!