Owaisi MP : ఇద్ద‌రు పిల్ల‌ల చ‌ట్టాన్ని స‌మ‌ర్థించం

ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ

Owaisi MP : ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ(Owaisi MP) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గురువారం ఆయ‌న స్పందించారు.  కేవ‌లం ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మాత్ర‌మే త‌ప్ప‌నిస‌రి చేసే ఏ చ‌ట్టాన్ని తాను ఎప్ప‌టికీ స‌మ‌ర్థించ‌బోన‌ని ఓవైసీ పేర్కొన్నారు.

కొన్ని రోజుల కింద‌టి నుంచి ముస్లింలు ఎక్కువ‌గా గ‌ర్భ నిరోధ‌కాల‌ను ఉప‌యోగిస్తున్నార‌ని వెల్ల‌డించారు ఓవైసీ. ముస్లింల భార‌త దేశానికి చెందిన వారు కాదా అని ప్ర‌శ్నించారు.

ఇదే స‌మ‌యంలో ఈ దేశంలో ఇద్ద‌రు పిల్లలు మాత్ర‌మే ఉండాలంటూ త‌ప్ప‌నిస‌రి చేసే చ‌ట్టాన్ని తాను ఒప్పుకోన‌న్నారు. దీనికి తాను ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌ద్ధ‌తు ఇవ్వ‌న‌ని స్ప‌ష్టం చేశారు ఓవైసీ.

ఏఎన్ఐ జాతీయ మీడియాతో ఇదే విష‌యాన్ని పేర్కొన్నారు. కొద్ది రోజుల కింద‌ట జ‌నాభా అస‌మ‌తుల్య‌త పై యూపీ సీఎం ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు స‌మాధానంగా ముస్లింలు ఎక్కువ‌గా గ‌ర్భ నిరోధ‌కాల‌ను ఉప‌యోగిస్తున్నార‌ని ఓవైసీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

జ‌నాభా నియంత్ర‌ణ‌కు దేశంలో ఎలాంటి చ‌ట్టం అవ‌స‌రం లేద‌ని వారి సొంత ఆరోగ్య శాఖ మంత్రి చెప్పార‌ని తెలిపారు. జ‌నాభా ప్ర‌శ్న‌పై ముస్లింల‌ను ఎందుకు ఎత్తి చూపుతున్నారంటూ అస‌దుద్దీన్ ఓవైసీ(Owaisi MP) ప్ర‌శ్నించారు.

ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. అవ‌గాహ‌న ద్వారా లేదా వారి జ‌నాభాను స్థిరీక‌రించాల‌ని పేర్కొన్నారు. ఇద్ద‌రు పిల్ల‌ల విధానం అనేది వివాదాస్ప‌ద అంశ‌మ‌ని, ఇది ఇంత‌కు ముందు అనేక సంద‌ర్భాల‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ.

ఇదిలా ఉండ‌గా అస్సాం, గుజ‌రాత్, రాజ‌స్థాన్ , మ‌హారాష్ట్ర‌, ఉత్త‌రాఖండ్ , ఒడిశా, తెలంగాణ , ఏపీతో స‌హా అనేక రాష్ట్రాల‌లో ఒక వ్య‌క్తికి ఇద్ద‌రి కంటే ఎక్కువ పిల్ల‌లు ఉంటే స్థానిక ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులు.

Also Read : దంతేవాడ‌ గిరిజ‌నుల హ‌త్య కేసు కొట్టివేత

Leave A Reply

Your Email Id will not be published!