BCCI Supreme Court : బీసీసీఐ బాస్ ల పదవీ కాలంపై ఉత్కంఠ
విచారించనున్న సర్వోన్నత న్యాయ స్థానం
BCCI Supreme Court : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాస్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా పదవీ కాలం త్వరలోనే ముగుస్తుంది.
దీంతో ఇప్పటి దాకా తమ కనుసన్నలలోనే బీసీసీఐని చెలాయిస్తూ వచ్చిన వీరిద్దరి పదవీ కాలం ఉంటుందా లేక ఊడి పోతుందా అన్నది దేశ సర్వోన్నత న్యాయ స్థానం(BCCI Supreme Court) తేల్చాల్సి ఉంది.
ఇప్పటికే జైషాపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో ఒకే నాయకుడు ఒకే పదవి అన్న నినాదం ఊపందుకుంది. దీనికే ప్రయారిటీ ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ.
అయితే జై షా తండ్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. తండ్రీ కొడుకులకు ఎందుకు ఈ రెండు పదవులు అంటూ నిలదీస్తున్నారు. ఇదే సమయంలో బీసీసీఐ బాస్ గా ఉన్న గంగూలీ తాజాగా ఐసీసీ చైర్మన్ రేసులో ఉన్నారు.
తాజాగా బీసీసీఐ (BCCI) సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలతో దాదాతో పాటు జై షా పదవీ కాలం ముగుస్తుంది. ఇక పోతే జై షా ఏసీసీ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నాడు.
ఈ పరిస్థితుల్లో టైం అయిపోతుండడంతో కొత్త పాలక వర్గం కొలువు తీరేంత వరకు పొడగించాలంటూ కోరింది బీసీసీఐ. ఈ అప్పీల్ పై భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు.
వచ్చే వారం విచారించాలో లేదోనన్న విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా 2019లో గంగూలీ, జై షా పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పదవీ కాలం ముగియనుంది.
Also Read : విరాట్ కోహ్లీ గ్రేట్ ప్లేయర్ – బాబర్ ఆజమ్