Babar Azam : బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు
ఫాస్టెస్ట్ 10 వేల రన్స్ చేసిన కెప్టెన్
Babar Azam : ప్రపంచ క్రికెట్ లో మరో మైలు రాయి చేరుకున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్. అత్యంత వేగవంతమైన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
కేవలం అతి తక్కువ కాలంలో 10,000 పరుగులు చేసిన పాక్ ప్లేయర్ గా చరిత్ర లిఖించాడు. ప్రస్తుత క్రికెట్ రంగంలో ఈ ఘనతను సాధించిన పాక్ బ్యాటర్ గా నిలిచాడు.
ఈ పాకిస్తాన్ స్కిప్పర్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్ లలో పరుగులు ధారాళంగా చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తను ఆడుతూ జట్టును విజయ పథంలోకి తీసుకెళుతున్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న ఒకటవ టెస్టు రెండో రోజున బాబర్ ఆజమ్(Babar Azam) 10,000 అంతర్జాతీయ పరుగులను పూర్తి చేశాడు. ఈ రన్స్ చేసేందుకు బాబర్ ఆజమ్ కేవలం 228 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడాడు.
రెండో స్థానంలో ఉన్న జావేద్ మియందాద్ కంటే 20 తక్కువ ఇన్నింగ్స్ లు చేశాడు. ఇదే పాకిస్తాన్ కు చెందిన మాజీ ఓపెనర్ సయిదీ అన్వర్ 10 వేల రన్స్ చేసేందుకు 255 ఇన్నింగ్స్ లు ఆడాడు.
ఇక మహ్మద్ యూనిస్ 261 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ పూర్తి చేశాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ 281 ఇన్సింగ్స్ లు ఆడి 10, 000 పరుగులు సాధించాడు.
ఇదిలా ఉండగా స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ టెస్టు ర్యాంకింగ్స్ లో వరల్డ్ వైడ్ గా చూస్తే నాలుగో స్థానంలో ఉన్నాడు. జో రూట్ , మార్నస్ లబూషేన్ , స్టీవ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు బాబర్ ఆజమ్(Babar Azam).
రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాలి.
Also Read : యూఈఏ లోనే ఈసారి ఆసియా కప్