Virat Kohli : సేమ్ సీన్ విరాట్ కోహ్లీ పరేషాన్
మరోసారి నిరాశ పరిచిన క్రికెటర్
Virat Kohli : భారత జట్టు కెప్టెన్ గా ఎనలేని విజయాలు సాధించి పెట్టిన స్టార్ క్రికెటర్. అంతే కాదు మెషీన్ గన్ అన్న పేరు కూడా ఉంది. ప్రపంచ క్రికెట్ లో ఎవరూ అందుకోలేనన్ని పరుగులు చేస్తూ తనకు తానే సాటి అని పేరు పొందిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇప్పుడు పరుగుల లేమితో బాధ పడుతున్నాడు.
గత కొన్నేళ్లుగా సెంచరీకి దూరమయ్యాడు. అడపా దడపా హాఫ్ సెంచరీలు చేసినా ఆశించినంత మేర రాణించ లేక పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తన క్రికెట్ కెరీర్ లోనే అత్యంత చెత్త రికార్డు కూడా.
ప్రస్తుతం వరల్డ్ లో తననే ఆదర్శంగా తీసుకుని ఎదిగిన పాకిస్తాన్ తాజా కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ లో కొనసాగుతున్నాడు.
ఇటీవలే కేవలం 228 ఇన్నింగ్స్ లు అన్ని ఫార్మాట్ లలో ఆడి అత్యంత తక్కువ కాలంలో 10,000 పరుగులు చేసిన మొట్ట మొదటి పాకిస్తాన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
ఓ వైపు యువ ఆటగాళ్లు తమ ఆట తీరుతో ఆకట్టుకుంటే విరాట్ కోహ్లీ మాత్రం పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఆడకుండా నిరాశకు గురి చేస్తున్న కోహ్లీని ఎందుకు జట్టులో ఉంచాలంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఏకంగా తీసి పారేయాలని వేరొకరికి చాన్స్ ఇవ్వాలని కోరాడు. తీవ్ర దుమారం రేపింది ఆయన చేసిన కామెంట్.
రోహిత్ శర్మ ఎన్నిసార్లు కోహ్లీకి మద్దతు పలికినా ఆట తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కేవలం 17 రన్స్ చేసి వెనుదిరిగాడు.
Also Read : ఇంగ్లండ్ పై విజయం వన్డే సీరీస్ కైవసం