YS Jagan : రామాయపట్నం పోర్టుతో ఎందరికో ఉపాధి
సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
YS Jagan : ఏపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతున్నామని అన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ రంగం , టెక్నాలజీ వినియోగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు.
బుధవారం రామాయపట్నం పోర్టు (ఓడ రేవు) నిర్మాణం కోసం ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చినందుకు వారిని అభినందించారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం జగన్ రెడ్డి. ఈ ఓడ రేవు నిర్మాణం పూర్తవుతే లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
ఆర్థిక పరమైన అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. యువత పనుల కోసం వలస వెళ్లకుండా ఉన్న చోటునే పని చేసుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు సీఎం.
ఓడ రేవు వచ్చేందుకు సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోర్టులో 75 శాతం మందికి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు జగన్ రెడ్డి.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఉండాలన్నదే తన ఆశయమన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు ఓడ రేవులు ఉన్నాయని మరో నాలుగు పోర్టులు తీసుకు వస్తామని వెల్లడించారు సీఎం. గత ప్రభుత్వం మాటలు చెప్పింది కానీ ప్రజలను మోసం చేసిందన్నారు.
Also Read : సమంత అక్షయ్ డ్యాన్స్ అదుర్స్