Rishi Sunak VS Liz Truss : బ్రిటన్ పీఎం రేసులో నువ్వా నేనా
ఐదో రౌండ్ లో రిషి దే హవా పెన్నీ అవుట్
Rishi Sunak VS Liz Truss : బ్రిటన్ ప్రధానమంత్రి రేసు మరింత ఉత్కంఠ భరితంగా రసవత్తరంగా మారింది. నాలుగో రౌండ్ దాకా గట్టి పోటీ ఇచ్చిన పెన్నీ మార్డాండ్ అనూహ్యంగా ఐదో రౌండ్ వచ్చే సరికి తప్పుకుంది.
దీంతో ప్రతిష్టాత్మకంగా భావించే పీఎం రేసులో ఇద్దరే మిగిలారు. ఒకరు భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్ , ఇంగ్లండ్ కు చెందిన లిజ్ ట్రస్ (Rishi Sunak VS Liz Truss) మధ్యే పోటీ ఉండనుంది.
మొదటి, రెండు, మూడో, నాలుగో రౌండ్ లోనూ రిషి సునక్ సత్తా చాటాడు. ప్రతి రౌండ్ లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. నువ్వా నేనా
అన్నట్లుగగా పెన్నీ దగ్గరగా వచ్చింది.
కానీ కీలకమైన ఐదో రౌండ్ లో వెనక్కి వెళ్లింది. పోటీ నుంచి నిష్క్రమించింది. చివరిదైన ఐదో రౌండ్ లో రిషి సునక్ సత్తా చాటాడు. 137 మంది ఎంపీల మద్దతు పొందాడు.
టాప్ లో నిలిచాడు. ఇక ఫైనల్ పోరు రిషి, లిజ్ మధ్యే ఉండనుంది. వచ్చే సెప్టెంబర్ 5న ఎవరు ప్రధానమంత్రి అన్నది తేలనుంది.కన్జర్వేటివ్
పార్టీకి చెందిన సభ్యులు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎన్నుకుంటారు.
మొదటి నుంచి తన వాగ్ధాటితో ఆకట్టుకుంటూ వచ్చిన పెన్నీ మార్డాంట్ ఉన్నట్టుండి 105 ఓట్లతో వైదొలగడం అందరినీ విస్తు పోయేలా చేసింది.
నాలుగో రౌండ్ దాకా రిషి సునక్ గట్టి పోటీ ఇచ్చింది.
విదేశాంగ శాఖ మంత్రి మూడో స్థానంలో ఉంటూ వచ్చింది. కానీ ఆఖరి రౌండ్ లో 113 ఓట్లతో రెండో స్థానంలోకి దూసుకు వచ్చింది. దీంతో పెన్నీ మార్డాంట్ కు కోలుకోలేని షాక్ తగిలింది.
అసలు కథ ముందుంది. ఆగస్టు 1 నుంచి నెల రోజుల పాటు దశల వారీగా పోలింగ్ జరుగుతుంది. లక్షా 60 వేలకు పైగా కన్జర్వేటివ్ కు చెందిన
సభ్యులు ఉన్నారు. రహస్య పద్దతిలో ఓటింగ్ లో పాల్గొంటారు. ఎవరైతే ఎక్కువ సీట్లు పొందుతారో వారే గెలుపొందుతారు.
Also Read : అనూహ్యంగా పెన్నీ మోర్డాంట్ నిష్క్రమణ