IND vs WI 1st ODI : విండీస్ తో భారత్ యుద్ధానికి సిద్దం
నువ్వా నేనా అంటున్న ఇరు జట్లు
IND vs WI 1st ODI : వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్ తో మొదటి వన్డే(IND vs WI 1st ODI) ఆడనుంది. క్వీన్ పార్క్ ఓవల్ లో ఇరు జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి.
ఇక బీసీసీఐ ఇప్పటి వరకు భారత జట్టుకు కెప్టెన్లను ఏడుగురిని మార్చింది. ఇది భారత దేశ క్రికెట్ చరిత్రలో ఓ రికార్డు. ఇప్పటి వరకు ఏ ఒక్కరు పూర్తి కాలం నాయకుడిగా ఉన్న దాఖాలాలు లేవు ఈ మధ్య కాలంలో.
విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత బీసీసీఐ సెలెక్టర్లు నానా తంటాలు పడుతున్నారు జట్టుకు కెప్టెన్ ను ఎంపిక చేయడంలో. రోహిత్ శర్మను అనుకున్నా ఎప్పుడు గాయపడతాడో ఎప్పుడు ఆడతాడో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాది లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఇందు కోసం బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు సెలెక్టర్లు. యువ ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నారు.
ఐపీఎల్ పుణ్యమా అని సత్తా చాటుతున్నారు. మరోవైపు సీనియర్లను పక్కన పెట్టడంతో వారికి విండీస్ తో జరిగే మూడు మ్యాచ్ లకు కీలకం కానుంది.
ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ , మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాలను దూరం పెట్టారు. శిఖర్ ధావన్ కు ఎవరు జోడిగా ఓపెనర్ గా వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇషాన్ కిషన్ , రుతురాజ్ , శుభ్ మన్ గిల్ పోటీలో ఉన్నారు. ఇక సంజూ శాంసన్ ను కూడా ప్రయోగించింది జట్టు.
ఇక జట్ల పరంగా చూస్తే ధావన్ కెప్టెన్ . రుతురాజ్, ఇషాన్ కిషన్ , అయ్యర్, హూడా, శాంసన్ , సూర్య కుమార్ , జడేజా, శార్దూల్ , ప్రసిద్ద్ క్రిష్ణ, చహాల్, సిరాజ్ ఉన్నారు.
ఇక విండీస్ జట్టు పరంగా చూస్తే పూరన్ కెప్టెన్. కింగ్, బ్రూక్స్ , మేయర్స్, హోప్ , పావెల్, హోల్డర్, హోసీన్ , జోఎఫ్, మోతీ, సీల్స్ ఆడతారు.
Also Read : రుతురాజ్ పై వసీం జాఫర్ కామెంట్స్