PM Modi : రాష్ట్రపతి గెలుపులో నరేంద్ర మోదీ మార్క్
వ్యూహాత్మకంగా అడుగులు వేసిన బీజేపీ
PM Modi : ఒక నాయకుడు ఎలా ఉండాలో. ఏం మాట్లాడాలో. ఏం మాట్లాడకూడదో. వ్యూహాత్మకంగా ఎలా అడుగులు వేయాలో, ప్రత్యర్థులను ఎలా దెబ్బ కొట్టాలలో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(PM Modi) తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదంటే నమ్మలేం.
ఓ వైపు ద్రవ్యోల్బణం, ఇంకో వైపు నిరుద్యోగం, ప్రతిపక్షాల విసుర్లు వీటన్నింటినీ దాటుకుని తాను అనుకున్న పనిని ఆచరణలో చేసి
చూపించారు మోదీ. ఇది ఆయనకు మాత్రమే సాధ్యమనే రీతిలో తనను తాను దిద్దుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పవర్ పుల్ లీడర్ గా పేరొందిన మోదీ ఏం చేసినా ఓ సంచలనమే అవుతోంది. ఓ వైపు మతం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చెలరేగుతున్నా ఎక్కడా తనదైన మార్క్ ను కోల్పోలేదు.
ఇదీ విజేతకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఒకప్పుడు బీజేపీ అంటే లాల్ క్రిష్ణ అద్వానీ, అటట్ బిహారీ వాజ్ పేయ్. కానీ ఇప్పుడు సీన్ మారింది.
వ్యూహం మారింది.
బీజేపీ సంప్రదాయాలకు ఎక్కువగా పెద్ద పీట వేస్తుందన్న ఆరోపణలను పూర్తిగా తిప్పి కొట్టేలా చేయడంలో నరేంద్ర మోదీ సక్సెస్ అయ్యారు.
కాషాయం అంటేనే ఉన్నత వర్గాలకు, సంపన్నులకు, వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందన్న విమర్శలను తిప్పి
కొట్టేలా చేయడంలో మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ఇప్పుడు బీజేపీ అంటే ఓ నమ్మకం. దేశంలో అత్యధిక జనాభా కలిగిన బహుజనులను తమ వైపు తిప్పుకునేలా చేయడంలో మోదీ పాత్ర ఉందన్నది వాస్తవం.
ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన భారత దేశ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకంగా 64 శాతం ఓట్లు తెచ్చుకుని ద్రౌపది ముర్ము గెలుపొందారు. కానీ ఇక్కడ విజయం సాధించింది ముర్ము కాదు నరేంద్ర మోదీ(PM Modi).
ఆయన అందించిన సహకారం, ప్రోత్సాహంతోనే ఆమె నెగ్గగలిగారు. మొదటి నుంచి మోదీ తాను ఏం చేస్తున్నాడో ఎవరికీ చెప్పడు. తన నమ్మకమైన టీం అమిత్ షా, జేపీ నడ్డాకు కూడా తెలియనివ్వడు.
అందరి అభిప్రాయాలు విన్నంత వరకే మౌనంగా ఉంటారు. ఆ తర్వాత తాను అనుకున్నది చెప్పేస్తారు మోదీ. అందుకే ఆయన దరిదాపుల్లోకి
వెళ్ల గలిగే సాహసం ఒక్కరికే ఉంది.
అది ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా. అడపా దడపా నడ్డాతో మాట్లాడడం తప్పితే ఓవరాల్ గా మోదీనే కీలకం.
Also Read : వ్యూహం ఫలించింది గెలుపు దక్కింది
Thank you @mygovt for the warm bundle of wishes and heartly messages https://t.co/8A3uxtHvXd
— Draupadi Murmu • ଦ୍ରୌପଦୀ ମୁର୍ମୁ (@draupadimurmupr) July 22, 2022