Samantha Ruth Prabhu : అత‌ను భ‌ర్త కాదు మాజీ భ‌ర్త – స‌మంత

కాఫీ విత్ క‌ర‌ణ్ -7 లో సంచ‌ల‌న కామెంట్స్

Samantha Ruth Prabhu : దేశంలో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఒకే ఒక్క పాట ఊ అంటావా తో స‌మంత రుతు ప్ర‌భు. ఆపై టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న అక్కినేని నాగార్జున, అమ‌ల త‌న‌యుడు నాగ చైత‌న్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది స‌మంత‌.

ఆ త‌ర్వాత ఎందుక‌నో వీరిద్ద‌రూ విడి పోయారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి విడాకుల ప‌ర్వం దేశ మంత‌టా చ‌ర్చ‌కు దారి తీసింది. తాను ఎలా బ‌త‌కాలో త‌న‌కు తెలుసుని వేరెవ‌రి జోక్యం అన‌వ‌స‌రం అంటూ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది స‌మంత రుతు ప్ర‌భు.

ఇక నాగ చైత‌న్యతో విడి పోయాక పెద్ద ఎత్తున ఆఫ‌ర్లు వ‌చ్చాయి. దీంతో ఆమె ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అటు కోలీవుడ్, టాలీపుడ్ ఇటు బాలీవుడ్ లో బిజీగా మారారు సమంత రుతు ప్ర‌భు(Samantha Ruth Prabhu).

త్వ‌ర‌లో హాలీవుడ్ సినిమాలో కూడా న‌టించ‌నున్న‌ట్లు టాక‌. ఇప్ప‌టికే క‌థ కూడా పూర్త‌యిందట‌. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కాఫీ విత్ క‌ర‌ణ్ పేరుతో ఓ పాపుల‌ర్ షో చేస్తున్నాడు.

ఇందులో టాప్ ప‌ర్స‌నాలిటీస్ అంటే హీరో హీరోయిన్ల‌తో ముచ్చ‌ట‌. ప్ర‌శ్న‌లు జ‌వాబులు అడ‌గ‌డం అన్న‌మాట‌. ఇందుకు సంబంధించిన ట్రైల‌ర్ కు విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

అదే స‌మ‌యంలో పాపుల‌ర్ సాంగ్ ఊ అంటావా సాంగ్ కు అక్ష‌య్ కుమార్ తో క‌లిసి సమంత రుతు ప్ర‌భు డ్యాన్స్ చేయ‌డం హ‌ల్ చ‌ల్ చేసింది.

ఇదిలా ఉండ‌గా ప్రోగ్రాంలో భాగంగా క‌ర‌ణ్ జోహార్ నాగ చైత‌న్య గురించి మీ భ‌ర్తి అని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది స‌మంత.

అత‌ను భ‌ర్త కాద‌ని మాజీ భ‌ర్త అని స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు స‌మంత చేసిన ఈ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : ఐఎఫ్ఎఫ్ కు ముఖ్య అతిథిగా స‌మంత

Leave A Reply

Your Email Id will not be published!