Akasa Air Booking Start : ఆకాసా ఎయిర్ లైన్స్ బుకింగ్ షురూ
ఆగస్టు 7 నుంచి ప్రారంభానికి ముహూర్తం
Akasa Air Booking Start : ఇండియన్ వారెన్ బఫెట్ గా పేరొందిన వ్యాపార దిగ్గజం రాకేష్ ఝున్ ఝున్ వాలాకు చెందిన ఆకాసా ఎయిర్ లైన్స్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే ట్రయల్ రన్ ప్రారంభించింది.
ఇందుకు డీజీసీఏ కూడా ఓకే చెప్పడంతో ఇక ఆకాశంలో విమానాలు ఎగిరేందుకు రెడీ అయ్యాయి. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైంది. వచ్చే ఆగస్టు 7 నుండి విమానాల ప్రయాణానికి సంబంధించి బుకింగ్ లు ప్రారంభించింది.
రాకేష్ ఝున్ ఝున్ వాలా దీనికి పూర్తి మద్దతు తెలుపుతుండడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పూర్తి స్థాయిలో భాగస్వామిగా భావించవచ్చు. ఇక మొదటి వాణిజ్య విమానాన్ని వచ్చే నెల నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది.
ఇందుకు గాను ఆరోజు ముంబై – అహ్మదాబాద్ మార్గంలో అకాసా ఎయిర్ లైన్స్(Akasa Air Booking Start) కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని నడుపుతారు. ఇదే తన మొదటి సర్వీస్ అన్నమాట.
ఇందుకు సంబంధించి ట్రయల్స్ , ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఆగస్టు 7 నుంచి ముంబై – అహ్మదాబాద్ రూట్ లో వారానికి ఒకసారి నడిచే 28 విమానాలతో పాటు ఆగస్టు 13 నుంచి బెంగళూరు కొచ్చి రూట్ లో 28 విమానాలకు సంబంధించిన టికెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు అకాస ఎయిర్ లైన్స్ శుక్రవారం వెల్లడించింది.
ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక మెల మెల్లగా అన్ని సర్వీసులను ప్రారంభిస్తామని ఆకాసా ఎయిర్ సహ వ్యవస్థాపకుడు , చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు.
మరో వైపు ఇతర ఎయిర్ లైన్స్ సంస్థలకు ఆకాస ఎయిర్ లైన్స్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
Also Read : తెలంగాణలో బిఈ భారీ పెట్టుబడి