National Film Awards 2022 : సూర‌రై పొట్రుకు అవార్డుల పంట

తెలుగు క‌ల‌ర్ ఫోటోకు పుర‌స్కారం

National Film Awards 2022 : అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే జాతీయ సినీ అవార్డుల‌ను(National Film Awards 2022) కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఈ ఏడాది 68వ జాతీయ సినిమా అవార్డుల‌ను డిక్లేర్ చేసింది. 2020వ సంవ‌త్స‌రంలో వ‌చ్చిన సినిమాలు ఇందులో పాలు పంచుకున్నాయి.

ఎక్కువ‌గా అవార్డులు సాధించాయి. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వివిధ రంగాల‌కు చెందిన వారిని గుర్తించి, గౌర‌వించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈసారి అంతా ఊహించిన‌ట్లుగానే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకున్న సూర్య న‌టించిన త‌మిళ చిత్రం సూర‌యై పొట్రుకు అవార్డుల పంట పండింది.ఇక తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా సినిమాకు కూడా అవార్డులు ద‌క్కాయి.

ఓటీటీలో విడుద‌లైన సూర‌రై పొట్రు (Soorarai Pottru)  సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇదే సినిమాలో అద్భుతంగా న‌టించి

మెప్పించిన హీరోయిన్ అప‌ర్ణ ముర‌ళికి జాతీయ ఉత్త‌మ న‌టి పుర‌స్కారం ద‌క్కింది.

ఉత్తమ సంగీత ద‌ర్శ‌కుడిగా జీవీ ప్ర‌కాశ్ కుమార్ , ఉత్త‌మ స్క్రీన్ ప్లే గా సుధా కొంగ‌ర‌, షాలిని ఉషాదేవి కి అవార్డులు ద‌క్కాయి. డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి. గోపీనాథ్ జీవితంలోని సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన సూరారై పొట్రు సంచ‌ల‌నం రేపింది.

అవార్డుల ప‌రంగా చూస్తే ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా స‌చి, అయ‌ప్పనుమ్ కోషియ‌మ్ కు ద‌క్కింది. ఉత్త‌మ న‌టుడిగా సూర్య‌, అజ‌య్ దేవ‌గ‌న్ నిలిచారు.ఉత్త‌మ స‌హాయ న‌టిగా ల‌క్ష్మి ప్రియా చంద్ర‌మౌళి, స‌హాయ న‌టుడిగా బీజు మీన‌న్ , ఉత్త‌మ తెలుగు చిత్రం క‌ల‌ర్ ఫోటో అవార్డులు ద‌క్కాయి.

ఉత్త‌మ త‌మిళ చిత్రం శివ‌రంజ‌నీయుమ్ ఇన్నుమ్ సిల ఫెంగ‌ల్ల‌మ్ , ఉత్త‌మ మ‌ల‌యాళ చిత్రం తింక క‌ల‌జ్చ నిశ్చ‌యం , ఉత్త‌మ మ‌రాఠీ చిత్రంగా

గోస్తా ఎకా పైతానిచి, ఉత్త‌మ క‌న్న‌డ చిత్రంగా డొల్లు, ఉత్త‌మ హిందీ చిత్రంగా టూల్సిదాస్ జూనియ‌ర్ , ఉత్త‌మ బెంగాలీ చిత్రంగా అవిజాట్రిక్ నిలిచింది.

ఉత్త‌మ అస్సామీ చిత్రంగా బ్రిడ్జ్ , ఉత్త‌మ తుళు చిత్రంగా జీతిగే, ఉత్త‌మ హ‌ర్యాన్వి చిత్రం దాదా ల‌క్ష్మీ, ఉత్త‌మ దిమాసా చిత్రం సేమ్ ఖోర్ , ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ నాట్యం, ఉత్త‌మ సాహిత్యం సైనా, ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌క‌త్వం అల వైకుంఠ పురంలో మూవీకి ఎస్ఎస్ థ‌మ‌న్(SS Thanman) కు అవార్డులు ల‌భించాయి.

బెస్ట్ మేక‌ప్ నాట్యం, ఉత్త‌మ ప్రొడ‌క్ష‌న్ డిజైన్ క‌ప్పెల‌, ఉత్త‌మ ఎడిటింగ్ శివ‌రంజ‌నియుమ్ , ఉత్త‌మ ఆడియోగ్ర‌ఫీ డొల్లు, ఉత్త‌మ స్క్రీన్ ప్లే సూర‌రై పొట్రు,

ఉత్త‌మ మాట‌ల ర‌చ‌యిత మండేలా, ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ అవిజాత్రిక్ , ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని నాంచ‌మ్మ‌, ఉ్త‌త‌మ నేప‌ధ్య

గాయ‌కుడు రాహుల్ దేశ్ పాండే, ఎంఐ వ‌సంత రావు, ఉత్త‌మ ప‌ర్యావ‌ర‌ణ చిత్రంగా మ‌నః అరు మ‌నుహ్ నిలిచాయి.

ఇంకా ప‌లు అవార్డులు ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం.

Also Read : అత‌ను భ‌ర్త కాదు మాజీ భ‌ర్త – స‌మంత

Leave A Reply

Your Email Id will not be published!