TTD EO Dharma Reddy : శ్రీవారి ఆస్తులకు ఆధునిక భద్రత
స్పష్టం చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
TTD EO Dharma Reddy : ప్రపంచంలో అత్యంత ధనికుడైన దేవుడు ఎవరయ్యా అంటే అది ఠక్కున అందరూ చెప్పే సమాధానం తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరుడు, అలివేలు మంగమ్మ.
కరోనా కారణంగా కొంత కాలం పాటు దర్శనాలు నిలిపి వేసినా ఆ తర్వాత తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన ఈవో ధర్మారెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సాధ్యమైనంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే స్వామి వారి దర్శనం కలిగించేలా చూస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తులు దేశ వ్యాప్తంగా ఉన్నాయి.
వాటికి పూర్తి భద్రత కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి శ్రీవారి ఆలయానికి సంబంధించి 10 టన్నుల బంగారం , రూ. 8,500 కోట్ల నగదు ఉందని ఈవో వెల్లడించారు.
రోజుకు కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద ఎత్తున పెరిగాయి. హుండీలో నగదుతో పాటు మరికొందరు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు.
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్ట్ లకు ప్రతి ఏటా రూ. 300 కోట్లకు పైగానే విరాళాలు అందుతున్నాయని ఈవో వెల్లడించారు. భక్తులు సమర్పించిన బంగారం మొత్తం 10 టన్నులకు పైగానే ఉందని దీనిని బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.
రూ. 8,500 కోట్ల నగదును ఫిక్స్ డిపాజిట్ చేసింది. టీటీడీకి నగదు, బంగారంతో పాటు విలువైన భూములను కానుకగా సమర్పించారు. నేపాల్ లోనూ స్వామి వారికి ఆస్తులున్నట్లు తెలిపారు ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy).
స్వామి వారికి సంబంధించి 7,636 ఎకరాలు ఉన్నాయి. ఇక నుంచి టీటీడీకి చెందిన ఆస్తులు విక్రయించ కూడాదని పాలకమండలి తీర్మానం చేసింది. దేశ వ్యాప్తంగా 1,128 ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
దేశ వ్యాప్తంగా టీటీడీకి 307 ప్రాంతాలలో కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఇక స్వామి వారి ఆస్తులకు ఆధునిక భద్రత కల్పించనున్నట్లు చెప్పారు ఈవో ధర్మారెడ్డి.
Also Read : ప్రజా సంక్షేమమే పరమావధి కావాలి