Ram Nath Kovind : ప్ర‌జా సంక్షేమమే ప‌ర‌మావ‌ధి కావాలి

వీడ్కోలు స‌భ‌లో రాష్ట్ర‌ప‌తి కోవింద్

Ram Nath Kovind : దేశ ప్ర‌యోజ‌నాల కోసం ప‌క్ష‌పాత రాజ‌కీయాల‌కు అతీతంగా ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్. ఆయ‌న 14వ రాష్ట్ర‌ప‌తిగా కొలువు తీరి ఆరేళ్లు పూర్త‌యింది.

ఇవాళ రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు స‌భ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా రామ్ నాథ్ కోవింద్ ఉద్విగ్న‌త‌కు లోన‌య్యారు. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

పార్ల‌మెంట్ అన్న‌ది ప్ర‌జాస్వామ్య దేవాల‌యం అని అభివ‌ర్ణించారు. స‌భ‌ల‌లో చ‌ర్చ‌ల సంద‌ర్భంగా జాతిపిత మ‌హాత్మా గాంధీ బోధించిన త‌త్వాన్ని ఉప‌యోగించాల‌ని ఆయా పార్టీల‌ను కోరారు.

ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఏది అవ‌స‌ర‌మో ముందు ఆయా పార్టీలు, నాయ‌కులు గుర్తించాల‌ని సూచించారు రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind).

పార్ల‌మెంట్ లో చ‌ర్చ‌, అస‌మ్మ‌తి హ‌క్కుల‌ను వినియోగించు కునేట‌ప్పుడు ఎంపీలు ఎల్ల‌ప్పుడూ సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తినిధిగా భార‌త దేశం నిలిచింద‌న్నారు.

దీనిని గుర్తించాల‌ని పేర్కొన్నారు రాష్ట్ర‌ప‌తి. ఇదిలా ఉండ‌గా ఈ వీడ్కోలు స‌మావేశంలో ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, ఎంపీలు, మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌రయ్యారు.

ఇదే స‌మ‌యంలో 15వ రాష్ట్ర‌ప‌తిగా ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన ఒడిశాకు చెందిన ఆదివాసీ బిడ్డ ద్రౌప‌ది ముర్మును హృద‌య పూర్వ‌కంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు రామ్ నాథ్ కోవింద్.

ఆమె మార్గ‌దర్శ‌క‌త్వం నుండి దేశం మ‌రింత ప్ర‌యోజ‌నం పొందుతుంద‌ని ఆశాభ‌వం వ్య‌క్తం చేశారు. ప‌విత్ర భ‌ర‌త మాత‌కు రాష్ట్ర‌ప‌తిగా ఉన్నందుకు సంతోషంగా ఉంద‌ని, అంత‌కంటే గ‌ర్వంగా ఉంద‌న్నారు.

Also Read : అవినీతి..అక్ర‌మాల‌లో ఆప్ టాప్ – ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!