Bhagwant Mann : నీ విజ‌యం ఎక్కు పెట్టిన బాణం – సీఎం

నీర‌జ్ చోప్రా గెలుపుపై భ‌గ‌వంత్ మాన్

Bhagwant Mann : సామాన్యులు సైతం ఈ దేశంలో అద్బుతాలు చేస్తారు. కావాల్సింద‌ల్లా ప‌ట్టుద‌ల. ధైర్యం. విశ్వాసం. త‌మ మీద త‌మ‌కు న‌మ్మ‌కం ఉండ‌డం. కోట్లాది భార‌తీయుల‌కు ఇవాళ పండుగ రోజు.

సాధించింది ఏ ప‌త‌క‌మైనా కావ‌చ్చు. కానీ అశేతు హిమాచ‌లం అంతా నీ గురించి చ‌ర్చిస్తోంది. కార‌ణం 133 కోట్ల మంది భార‌తీయులంతా ఇవాళ నువ్వు సాధించిన ప‌త‌కాన్ని చూసి సంతోషంతో ఉన్నారు.

ఇలాంటి అరుదైన స‌న్నివేశాలు కాల గ‌మ‌నంలో కొన్ని సార్లే వ‌స్తుంటాయి. నీర‌జ్ చోప్రా (Neeraj Chopra) నీలాంటి ప‌ట్టుద‌ల క‌లిగిన ధీరోదాత్తులు కావాలి ఈ దేశానికి అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్.

ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్ షిప్ లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన చోప్రాను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆదివారం సీఎం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించాడు.

నెత్తురు మండిన యువ‌తీ యువ‌కులే ఈ దేశానికి భాగ్య విధాత‌లు. వారే దేశాన్ని నిర్దేశించే నాయ‌కులు అని పేర్కొన్నారు భ‌గ‌వంత్ మాన్.

విమానం రెక్క‌లు కాదు ధైర్యం..భ‌విష్య‌త్తు ప‌ట్ల న‌మ్మ‌కాన్ని పెంచిన నీ విజ‌యాన్ని చూసి గ‌ర్వంగా ఉంద‌న్నారు పంజాబ్ సీఎం(Bhagwant Mann).

తాము కూడా యువ‌త‌కు ప్ర‌యారిటీ ఇస్తున్నామ‌ని ఎవ‌రైనా స‌రే క‌ష్ట‌ప‌డితే విజ‌యం త‌ప్ప‌క ద‌క్కుతుంద‌ని నీర‌జ్ చోప్రాను చూసి నేర్చు కోవాల‌ని సూచించారు.

2003లో జ‌రిగిన అథ్లెటిక్స్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ పోటీల్లో లాంగ్ జంప్ లో అంజు జార్జి కాంస్య ప‌త‌కం సాధించి చ‌రిత్ర సృష్టించింది. అయితే 19 ఏళ్ల సుదీర్ఘ కాలం త‌ర్వాత భార‌త దేశానికి చెందిన నీర‌జ్ చోప్రా రెండో ఆట‌గాడిగా ప‌త‌కాన్ని సాధించాడు.

Also Read : నిన్ను చూసి దేశం గ‌ర్విస్తోంది – టికాయ‌త్

Leave A Reply

Your Email Id will not be published!