YS Jagan Neeraj Chopra : నీ విజయం స్పూర్తిదాయకం – జగన్
నీరజ్ చోప్రాకు ఏపీ సీఎం అభినందన
YS Jagan Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో ఆదివారం అరుదైన ఘనత సాధించిన హర్యానా పానిపట్ కు చెందిన నీరజ్ చోప్రాను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) .
ట్విట్టర్ వేదికగా సీఎం స్పందించారు. నీరజ్ చోప్రాకు కంగ్రాట్స్ తెలిపారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఇప్పటి వరకు సిల్వర్ మెడల్ ను సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించారు నీరజ్ చోప్రా(Neeraj Chopra).
గతంంలో 2003వ సంవత్సరంలో లాంగ్ జంప్ విభాగంలో అంజూ జార్జి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర లిఖించింది. 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నీరజ్ చోప్రా మరోసారి భారతీయ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై ఎగిరేలా చేశాడు.
జూలై 24న జరిగిన పోటీల్లో నీరజ్ చోప్రా కొద్ది పాటి తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయాడు. రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
గురి పెట్టిన బాణం ఎప్పటికీ వెనక్కి వెళ్లదని అది అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని నిరూపించావంటూ నీరజ్ చోప్రాను ప్రశంసలతో ముంచెత్తారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Neeraj Chopra).
మరోసారి భారత దేశం తల ఎత్తుకునేలా చేసినందుకు నీకు ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని, భారతీయ మువ్వొన్నెల పతాకం రెప రెప లాడేలా చేయాలని కోరారు సీఎం.
ఇదిలా ఉండగా హర్యానా లోని పానిపట్ కు చెందిన నీరజ్ చోప్రాను(Neeraj Chopra) ప్రధాన మంత్రి మోదీ కూడా అభినందించారు.
Also Read : నీ విజయం ఎక్కు పెట్టిన బాణం – సీఎం