Neeraj Chopra : అర్షద్ నదీమ్ కు నీరజ్ చోప్రా అభినందన
ప్రదర్శన బాగుందంటూ కితాబిచ్చిన అథ్లెట్
Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో జరిగిన జావెలిన్ త్రోలో తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు భారత దేశానికి చెందిన నీరజ్ చోప్రా. రెండో స్థానంలో నిలిచి సిల్వర్ (రజత) పతకాన్ని సాధించాడు.
2003 లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో ఇండియాకు చెందిన అంజు జార్జి లాంగ్ జంప్ పోటీలో కాంస్య పతకాన్ని సాధించారు. 19 ఏళ్ల తర్వాత హర్యానాలోని పానిపట్ కి చెందిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు.
ఈ సందర్భంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. దాయాది పాకిస్తాన్ కు చెందిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు నీరజ్ చోప్రా. పోటీ ముగిసిన వెంటనే నాకు అనిపించింది.
నాతో పాటు నదీమ్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడని కితాబు ఇచ్చాడు. చివరి దాకా ప్రయత్నం చేశాడని పేర్కొన్నాడు. కానీ అనుకోకుండా మోచేతిలో సమస్యలు ఉన్నాయని తనతో చెప్పాడని తెలిపాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra).
ఏది ఏదైనా నాతో పాటు అతను అద్భుతంగా ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నాడు. అతను త్వరగా గాయం నుంచి కోలుకోవాలని కోరానని తెలిపాడు.
అర్షద్ నదీమ్ జావెలిన్ ను 86 మీటర్లకు పైగా విసిరాడని కొనియాడారు. ఈ విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు నీరజ్ చోప్రా.
ఇదిలా ఉండగా 2018లో జకార్తా ఆసియా క్రీడల సందర్భంగా పోడియం వద్ద ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆనాడు అర్షద్ , నీరజ్ చోప్రాలు వైరల్ గా మారింది.
అర్షద్ తో పాటు తన కాలు తొడలో కొద్దిగా అసౌకర్యాన్ని అనుభవించానని తెలిపాడు.
Also Read : విండీస్ పై విజయం సీరీస్ కైవసం