Team India Celebrations : అంబ‌రాన్నంటిన సంబురం

టీమిండియా సెల‌బ్రేష‌న్స్ అదుర్స్

Team India Celebrations : వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు విండీస్ టూర్ లో భాగంగా స‌త్తా చాటింది. మూడు వ‌న్డే మ్యాచ్ ల సీరీస్ ను 2-0 తేడాతో ఓడించి కైవ‌సం చేసుకుంది.

ఇక మూడో మ్యాచ్ మాత్రం నామ‌మాత్రం కానుంది. కంటిన్యూగా ఒక జ‌ట్టుపై అత్య‌ధిక సీరీస్ లు కైవ‌సం చేసుకున్న జ‌ట్టుగా కూడా టీమిండియా రికార్డు సృష్టించింది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జ‌రిగిన తొలి మ్యాచ్ లో భార‌త జ‌ట్టు 3 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. చివ‌రి బంతి దాకా ఉత్కంఠ నెల‌కొంది.

ఆతిథ్య జ‌ట్టు కూడా చుక్క‌లు చూపించింది.

కానీ హైద‌రాబాదీ స్టార్ మ‌హ్మ‌ద్ సిరాజ్ అద్బుత‌మైన బౌలింగ్ కు తోడు సూప‌ర్బ్ ప‌ర్ ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్న కేర‌ళ స్టార్ వికెట్ కీప‌ర్ సంజూ

శాంస‌న్ అడ్డుకోవ‌డంతో ఆ మ్యాచ్ భార‌త్ వ‌శ‌మైంది.

ఇక సీరీస్ ను నిర్ణ‌యించే కీల‌క‌మైన రెండో వ‌న్డేలో భార‌త జ‌ట్టు 2 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఈ మ్యాచ్ కూడా ఆఖ‌రి ఓవ‌ర్ దాకా నువ్వా

నేనా అన్న రీతిలో సాగింది.

చివ‌రి ఓవ‌ర్ లో 8 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా భార‌త బౌల‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ మార‌థాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 64 ప‌రుగులు చేసి టీమిండియాకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యం ద‌క్కేలా చేశాడు.

ఇంకా ఇద్ద‌రి గురించి చెప్పుకోవాలి ఈ మ్యాచ్ లో . వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించింది. ఆ టార్గెట్ ను ఛేదించ‌డంలో భార‌త్ బ్యాట‌ర్లు బాగా ఆడారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ , సంజూ శాంస‌న్ క‌లిసి జ‌ట్టును గ‌ట్టెక్కించారు.

ఈ సంద‌ర్భంగా స్టార్ ప్లేయ‌ర్లు లేక పోయినా భార‌త్ సీరీస్ గెలుచు కోవ‌డంలో డ్రెస్సింగ్ రూమ్ లో సెల‌బ్రేష‌న్స్(Team India Celebrations) చేసుకున్నారు ఆట‌గాళ్లు. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ గా మారింది.

Also Read : విండీస్ పై విజ‌యం సీరీస్ కైవ‌సం

 

 

 

Leave A Reply

Your Email Id will not be published!