JMM BJP : బీజేపీకి జార్ఖండ్ ముక్తీ మోర్చా ఝ‌ల‌క్

బీజేపీ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నారు

JMM BJP : కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కు పూర్తిగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఈ మేర‌కు దేశంలో బీజేపీ తప్ప ఇంకే పార్టీ ఉండ కూడ‌ద‌నే ల‌క్ష్యంతో ప‌ని చేస్తోంది.

ఇందుకు సంబంధించి అవ‌స‌ర‌మైనంత మేర‌కు కోట్లు కుమ్మరిస్తోంది. కాదంటే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తోంది. విన‌కంటే అక్ర‌మంగా కేసులు బ‌నాయిస్తోంది.

ఆపై త‌ల వంచ‌క పోతే అరెస్ట్ ల‌కు పాల్ప‌డుతోంది. ఆపై సీబీఐ, ఈడీ, ఏసీబీ, ఐటీ ఇలా త‌న‌కు కావాల్సిన సంస్థ‌ల‌తో షాక్ ఇస్తూ భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మోదీ ప్ర‌భుత్వం రెండో సారి కొలువు తీరాక మెజారిటీ ఉన్నప్ప‌టికీ చీలిక‌లు తీసుకు వ‌చ్చి ఏకంగా 9 ప్ర‌భుత్వాల‌ను కూల‌దోసింది.

తాజాగా దేశంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నిన్న‌టి దాకా కేంద్రంపై యుద్దం ప్ర‌క‌టించిన శివ‌సేన సైతం

పిల్లిలా నోరు మూసుకుని ద్రౌప‌దికి మ‌ద్ద‌తు ఇచ్చింది.

వాస్త‌వానికి అధికార పార్టీకి చెందిన వారికంటే ప్ర‌తిపక్షాల‌కే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. న్యాయ ప‌రంగా అన్ని ఓట్లు ప‌డితే విప‌క్షాల ఉమ్మ‌డి

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సిన్హా గెలిచి ఉండాల్సింది ఉంది.

కానీ బీజేపీ అలా కానివ్వ‌లేదు. రంగంలోకి మోదీ, అమిత్ షా, న‌డ్డా దిగారు. సీన్ మారింది మేడం గెలిచింది. ఇది ప‌క్క‌న పెడితే ఈ ఎన్నిక‌ల్లో

జార్ఖండ్ ముక్తి మోర్చా మొద‌టి నుంచీ బీజేపీని వ్య‌తిరేకిస్తూ వ‌స్తోంది.

కాక పోతే ఈ రాష్ట్ర‌ప‌తి ఒక‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ గా ఉన్నారు జార్ఖండ్ కు . ఆదివాసీ తెగ‌కు చెందిన వ్య‌క్తి కాబ‌ట్టి ఆమెకు మ‌ద్ద‌తు ఇచ్చారు. దీంతో ఈ

స‌ర్కార్ ను కూడా కూల్చే చాన్స్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

కానీ ఊహించ‌ని రీతిలో జార్ఖండ్ ముక్తి మోర్చా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. మీ పార్టికి చెందిన ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నారంటూ స్ప‌ష్టం చేసింది.

దీంతో ఇప్పుడు కాషాయానికి ఏం చేయాలో పాలు పోవ‌డం లేదు. మొత్తం 16 మంది త‌మ‌తో కలిసేందుకు రెడీగా ఉన్నారంటూ ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి సుప్రియో భ‌ట్టాచార్య వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం జార్ఖండ్ లో జేఎంఎం పాల‌న స్థిరంగా న‌డుస్తోంది.

2019 ఎన్నిక‌ల్లో 81 స్థానాల‌కు గాను జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం తో పాటు బీజేపీ 25 స్థానాలు పొందింది. ఇక్క‌డ కూడా హేమంత్ సోరేన్ ను త‌ప్పించాల‌ని చూస్తోంది కాషాయ పార్టీ. కానీ వ‌ర్క‌వుట్ అయ్యేలా లేదు.

Also Read : రాష్ట్ర‌ప‌తికి దేశాధినేత‌ల కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!