SL vs PAK 2nd Test : లంకేయుల దెబ్బకు పాక్ విల విల
తొలి ఇన్నింగ్స్ లో బౌలర్ల ప్రతాపం
SL vs PAK 2nd Test : ఆతిథ్య శ్రీలంక జట్టు కోల్పోయిన పరువును తిరిగి తెచ్చుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది. గాలే వేదికగా తృటిలో విజయాన్ని కోల్పోయిన ఆ జట్టు రెండో టెస్టులో(SL vs PAK 2nd Test) పట్టు బిగుస్తోంది ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై.
రెండు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైంది శ్రీలంక. ఇక రెండో టెస్టులో అద్భుతంగా రాణించింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ. లంక స్పిన్నర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాటర్లు విల విల లాడారు.
పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. దీంతో లంకేయుల దెబ్బకు ఇప్పటికే ఏడుగురు పెవిలియన్ బాట పట్టారు. కేవలం 191 పరుగులు మాత్రమే చేశారు.
ఇక టెస్టు మ్యాచ్ లో భాగంగా 315 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 63 పరుగులు జోడించింది. 378 పరుగులకు చాప చుట్టేసింది.
చండిమాల్ చెలరేగితే డిక్వెల్లా హాఫ్ సెంచరీతో మెరిశాడు. రమేష్ మెండీస్ 35 పరుగులు చేసి రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది.
లంక స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. వికెట్లను కోల్పోతూ వచ్చింది. మొదటి టెస్టులో సెంచరీతో జట్టును గెలిపించిన షఫీక్ ఈ ఇన్నింగ్స్ లో సున్నాకే వెనుదిరిగాడు. ఓపెనర్ హక్ 32 రన్స్ చేస్తే కెప్టెన్ ఆజమ్ 16 రన్స్ కే పెవిలియన్ బాట పట్టారు.
రిజ్వాన్ 24 , ఫవాద్ ఆలం 24 రన్స్ చేశారు. మిడిలార్డర్ లో వచ్చిన సల్మాన్ అద్భుతంగా ఆడాడు 62 పరుగులు చేసి లంక బౌలర్లను ఎదుర్కొన్నాడు. ప్రభాత్ జయ సూర్య బంతికి వికెట్ సమర్పించుకున్నాడు.
Also Read : పెళ్లిలో సైతం ఇంత టెన్షన్ పడలేదు