Neeraj Chopra : కామన్వెల్త్ గేమ్స్ కు నీరజ్ చోప్రా దూరం
తొడలో గాయం కారణం కారణంగా ఔట్
Neeraj Chopra : భారత్ కి కోలుకోలేని షాక్ తగిలింది. ప్రముఖ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బర్మింగ్ హోమ్ లో ఈ ఏడాది జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ -2022 కు దూరం కానున్నాడు.
తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో హర్యానా లోని పానిపట్ ప్రాంతానికి చెందిన చోప్రా త్రుటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు.
19 ఏళ్ల తర్వాత రెండో అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు. 2003లో మొదటిసారిగా ఇదే భారత దేశానికి చెందిన అంజూ జార్జి లాంగ్ జంప్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది.
సుదీర్ఘ కాలం తర్వాత నీరజ్ చోప్రా ఇదే వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించాడు. ఇదే సమయంలో ప్రాక్టీస్ చేస్తుండగా నీరజ్ చోప్రా(Neeraj Chopra) కాలు గజ్జల్లో గాయమైంది.
దీంతో కనీసం నడవలేని పరిస్థితిలో ఉండడంతో కామన్వెల్త్ గేమ్స్ కు దూరమైనట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. మంగళవారం అధికారికంగా ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
ఇదే విషయాన్ని స్వయంగా కాంస్య పతకం సాధించిన అనంతరం స్పష్టం చేశారు నీరజ్ చోప్రా(Neeraj Chopra). తొడ కండరాలు పట్టేశాయని అందుకే తాను పరుగులు తీయలేక పోతున్నానని తెలిపాడు.
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా కాలేక పోతున్నాడని తెలిపింది. త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం నీరజ్ చోప్రా చికిత్స తీసుకుంటున్నాడు.
Also Read : మిథాలీ రాజ్ షాకింగ్ కామెంట్స్