Neeraj Chopra : కామెన్వెల్త్ గేమ్స్ కు దూరం బాధాకరం
ఆవేదన వ్యక్తం చేసిన నీరజ్ చోప్రా
Neeraj Chopra : బర్మింగ్ హోమ్ లో ఈ ఏడాది జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ -2022 కు దూరం కావడం తనను తీవ్రంగా కలిచి వేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ప్రముఖ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు.
కానీ 19 ఏళ్ల తర్వాత భారత దేశానికి సిల్వర్ (రజత) పతకాన్ని అందించాడు. దేశానికి గర్వ కారణంగా నిలిచాడు. గతంలో 2003లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఇండియాకు చెందిన అంజూ జార్జి లాంగ్ జంప్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టింది.
ఆమె తర్వాత ఇప్పుడు నీరజ్ చోప్రా పతకం సాధించి అరుదైన ఘనత వహంచాడు. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో చోప్రా బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు.
మొదటి భారతీయుడిగా నిలిచాడు. కాగా ఈసారి జరిగిన పోటీల్లో గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ కు దూరంగా ఉన్నాడు. ఇదే విషయాన్ని భారతీయ క్రీడా సమాఖ్య వెల్లడించింది.
ఈ సందర్భంగా తాను తీవ్రంగా బాధ పడుతున్నానని, తాను ప్రాతినిధ్యం వహించలేక పోతున్నందుకు తెలిపాడు.
ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రారంభోత్సవ వేడుకలో భారత దేశం తరపున జాతీయ పతాకాన్ని ధరించే అవకాశాన్ని కోల్పోవడం తనను మరింత నిరాశకు, బాధకు గురి చేసిందన్నాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra).
ఏ క్రీడాకారుడైనా తన దేశానికి చెందిన పతాకాన్ని ధరించాలని అనుకుంటాడని ఈ సందర్భంగా అన్నాడు. నీరజ్ చోప్రాది హర్యానా లోని పానిపట్ స్వస్థలం. ఎన్నో పతకాలు సాధించాడు.
Also Read : జోరు మీదున్న టీమిండియా