VVS Laxman Vettori : మెన్స్ క్రికెట్ క‌మిటీలో వీవీఎస్..వెటోరీ

2025 విమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త్ లో

VVS Laxman Vettori : హైద‌రాబాదీకి చెందిన క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ కు కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ క్రికెట్ కమిటీ ప్ర‌తినిధులుగా ల‌క్ష్మ‌ణ్ తో పాటు వెటోరీని(Vettori) ఎంపిక చేసింది.

ఈ విష‌యాన్ని అధికారికంగా ఐసీసీ వెల్ల‌డించింది. ల‌క్ష్మ‌ణ్(VVS Laxman) గ‌తంలో భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడాడు. అంత‌కు ముందు హైద‌రాబాద్ నుంచి చాలా మంది ఆట‌గాళ్లు ప్రాతినిధ్యం వ‌హించారు.

సీకే నాయుడు, శివ‌లాల్ యాద‌వ్ , మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్, అర్ష‌ద్ అయూబ్ , వెంక‌ట‌ప‌తి రాజు, మ‌హ్మ‌ద్ సిరాజ్ ఉన్నారు. ప్ర‌స్తుతం ల‌క్ష‌ణ్ బెంగాళూరు లోని ఎన్సీఏ అకాడ‌మీ చైర్మ‌న్ గా ఉన్నాడు.

గ‌తంలో దీనికి హెడ్ గా రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid) వ్య‌వ‌హ‌రించాడు. ప్ర‌స్తుతం ద్ర‌విడ్ భార‌త క్రికెట్ జ‌ట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఇక ల‌క్ష్మ‌ణ్ , వెటోరీతో(VVS Laxman Vettori)  పాటు మాజీ క్రికెట‌ర్ రోజ‌ర్ హార్ప‌ర్ ను కూడా ప్ర‌తినిధిగా చేర్చింది.

జూలై 26న బ‌ర్మింగ్ హోమ్ వేదిక‌గా ఐసీసీ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక మాజీ క్రికెట‌ర్ మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే ఐసీసీ మెన్స్ క్రికెట్ లో ఫాస్ట్ ప్లేయ‌ర్ ప్ర‌తినిధిగా ఉన్నాడు.

ఇదే స‌మావేశంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ఐసీసీ(ICC). 2025లో జ‌రిగే మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు భార‌త్ లో జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌క‌టించింది.

ఇక్క‌డే మెన్స్ వ‌ర‌ల్డ్ క్రికెట్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. 2023-27 విమెన్స్ జ‌ట్ల షెడ్యూల్స్ ను ఖ‌రారు చేసింది ఐసీసీ. ఇక 2024లో బంగ్లాదేశ్ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇస్తుంద‌ని ఐసీసీ ప్ర‌క‌టించింది.

Also Read : కామెన్వెల్త్ గేమ్స్ కు దూరం బాధాక‌రం

Leave A Reply

Your Email Id will not be published!