Uddhav Thackeray : ఘనమైన వారసత్వానికి ‘ఠాక్రే’ ప్రతీక
ఇవాళ ఉద్దవ్ ఠాక్రే పుట్టిన రోజు
Uddhav Thackeray : మరాఠా రాజకీయాలలో చెరపలేని సంతకం శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే. ఇవాళ ఆయన పుట్టిన రోజు. సరిగ్గా ఇదే రోజు జూలై 27, 1960లో పుట్టారు.
ఆయన తండ్రి పేరొందిన రాజకీయ నాయకుడు. ప్రముఖ హిందూ వాది. మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే. ఆయన ఉన్నంత వరకు మరాఠాలో ఇతరులు వేలు పెట్టిన వారు లేరు.
అంతలా తనను తాను తీర్చి దిద్దుకున్నారు. బాలా సాహెబ్ అంటేనే పులి. ఆయన పేరు చెబితే చాలు లక్షలాది మంది తరలి వచ్చేలా తయారు
చేశాడు శివసేనను. ప్రస్తుతం తండ్రి మరణాంతరం పార్టీని నడిపిస్తున్నారు.
మహా వికాస్ అఘాడీ పేరుతో ఏర్పాటైన ప్రభుత్వానికి సీఎంగా పని చేశారు. రెండున్నర ఏళ్లపాటు పని చేశారు. తన స్వంత పార్టీ నుంచే వ్యతిరేకత , తిరుగుబాటు ఎదురై తన పదవికి రాజీనామా చేశాడు.
తనకు పదవుల కంటే ఆత్మాభిమానం గొప్పదని ప్రకటించాడు. ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్రకు 19వ రాష్ట్రపతి గా కొలువు తీరాడు. భార్య రష్మీ ఠాక్రే.
కొడుకు ఆదిత్యా ఠాక్రే. ముంబైలోని బాంద్రా ఈస్ట్ లోని మాతోశ్రీలో ఉంటున్నారు.
మరాఠా రాజకీయాలకు ఈ భవనం కేంద్రంగా ఉంది. ప్రస్తుతం ఉద్దవ్ ఠాక్రేకు(Uddhav Thackeray) ఇవాళ్టి తో 62 ఏళ్లు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరెన్నో మలుపులు ఉన్నాయి.
తండ్రి నుంచి ధీరత్వం కలిగినా ఎందుకనో మౌనాన్నే ఆశ్రయిస్తూ వచ్చారు ఆయన. ముగ్గురు కుమారాలలో ఉద్దవ్ చిన్నవాడు. బాల్మోహన్ విద్యా మందిర్ లో చదివాడు.
జేజే నుండి డిగ్రీ చదివాడు. ఆర్ట్ ఫోటోగ్రఫీపై పట్టు సాధించాడు. 2002లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ప్రచార ఇంఛార్జిగా ఠాక్రే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 2006లో పార్టీ మౌత్ పీస్ గా పేరొందిన సామ్నా పత్రికకు ప్రధాన సంపాదకుడిగా ఉన్నాడు. 2019లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు ఉన్నాడు.
ఆ తర్వాత ఎడిటర్ పదవికి రాజీనామా చేశాడు. ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) కు తండ్రి చేదోడు అయితే భార్య వెన్నంటి ఉంది. ఏది ఏమైనా మరాఠా రాజకీయాల్లో ఉద్దవ్ చెరపలేని సంతకం.
Also Read : సోనియా పట్ల కక్ష సాధింపు తగదు – రౌత్