Suraj Singh : యువ రెజ్లర్ సూరజ్ సింగ్ సెన్సేషన్
అండర్ -17 ఛాంపియన్ షిప్ లో పసిడి పతకం
Suraj Singh : నిన్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా త్రుటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. సిల్వర్ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు.
ఈ తరుణంలో ప్రపంచ రెజ్లింగ్ అండర్ -17లో మరో ఘనత సాధించాడు భారత దేశానికి చెందిన రెజ్లర్ సూరజ్ సింగ్(Suraj Singh). 32 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం స్వర్ణ పతకం భారత దేశానికి లభించింది.
ఇది ఓ రికార్డ్ . జూలై 26న జరిగిన 55 కేజీల గ్రీక్ రోమన్ విభాగంలో సూరజ్ సింగ్ విజేతగా నిలిచాడు. భారత్ కు పేరు తీసుకు వచ్చాడు.
పోటీకి సంబంధించి జరిగిన ఫైనల్ లో సూరజ్ సింగ్ 11- తేడాతో అజర్ బైజాన్ కి చెందిన ఫరైమ్ ముస్తఫయెవ్ పై ఘన విజయాన్ని నమోదు చేశాడు.
1990లో పప్పూ యాదవ్ తర్వాత పతకాన్ని సాధించిన క్రీడాకారుడిగా సూరజ్ సింగ్(Suraj Singh) నిలిచాడు. ఇక గ్రీకో రోమన్ విభాగంలో పసిడిని చేజిక్కించుకున్న రెజ్లర్ గా అరుదైన ఘనత సాధించాడు.
1990 నుండి భారత దేశం ఉండర్ 17 ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో ఐదు వేర్వేరు రెజ్లర్ల్ ఫైనల్ కు చేరుకున్నారు. కానీ చివరి వరకు వచ్చినా బంగారు పతకాన్ని చేజిక్కించు కోలేక పోయారు.
అండర్ 17న వరల్డ్ లో భారత దేశానికి ఏకైక మూడో స్వర్ణం దక్కడం. అన్ని ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో కలిపి నాల్గోది.
1992లో అండర్ 20 లో ప్రపంచ ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్న యాదవ్ తో పాటు 1980లో అండర్ 17 వరల్డ్స్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు వినోద్ కుమార్.
Also Read : మెన్స్ క్రికెట్ కమిటీలో వీవీఎస్..వెటోరీ