National Comment : పడగొట్టడమే ప్రజాస్వామమా
కూల దోయడం ప్రమాదకరం
National Comment : దేశంలో ఏం జరుగుతోంది. ఎన్నికైన ప్రభుత్వాలను అసమ్మతి స్వరం పేరుతో కూల్చేయడం రివాజుగా మారింది. ఇది చివరకు ప్రతీకారానికి ప్రతీకగా మారింది.
ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలకు కూడా చోటుండడం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో ఇలాంటివి జరుగుతాయనే గుర్తించాడు.
అందుకే భారత రాజ్యాంగానికి శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలోనే అత్యంత గొప్పనైన మార్గదర్శకత్వం వహించే సాధనాన్ని ప్రజలకు అందించారు.
కానీ ఇవాళ 30 లేదా 35 శాతం మాత్రమే ఓటు బ్యాంకు కలిగి పవర్ లోకి వచ్చిన పార్టీ కూలదోయడమే పనిగా పెట్టుకుంది. సమాఖ్య భావనకు మంగళం పాడింది.
కేంద్రంలో రెండోసారి కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ నిస్సిగ్గుగా కూల్చుకుంటూ పోతోంది.
తమకు ఎదురే లేకుండా చేసుకుంటూ వెళుతోంది. ఒకే పార్టీ ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే పౌరసత్వం(National Comment) పేరుతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు.
చివరకు రాచరికం అనిపించుకుంటుంది. దేశంలో ఇప్పటి వరకు 9 రాష్ట్రాలను కూల్చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి.
కానీ విపక్షాలను మాత్రమే టార్గెట్ చేయడం రాజకీయ దుమారం రేగుతోంది. ఇది పక్కన పెడితే మరాఠా కూలి పోయింది. ఇప్పుడు బహిరంగంగా ఛత్తీస్ గఢ్ , జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ ఉందంటూ ప్రకటించడం దేనికి సంకేతం.
ఒక్కసారి కాషాయ శ్రేణులు ఆలోచించాలి. తాజాగా బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి 38 మంది టీఎంసీ(TMC) ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారు.
అంటే దీదీ సర్కార్ కూలి పోనుందా అన్న అనుమానం రాక మానదు. పడగొట్టడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా ఏలిన వారు ఆలోచించాలి. ప్రజలు పునరాలోచించాలి.
Also Read : టచ్ లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు