SL vs PAK 2nd Test : డిసిల్వా సెన్సేషన్ పాకిస్తాన్ పరేషాన్
పాకిస్తాన్ ముందు 508 పరుగుల టార్గెట్
SL vs PAK 2nd Test : లంక వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ జట్టు కష్టాల్లో కొనసాగుతోంది. ఆతిథ్య శ్రీలంక జట్టు దుమ్ము రేపింది. ఏకంగా ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు ముందు 508 పరుగుల భారీ టార్గెట్ ముందుంచింది.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్(SL vs PAK 2nd Test) ను 360 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది ఎనిమిది వికెట్లు కోల్పోయి. లోయర్ ఆర్డర్ బ్యాటర్ ధనంజయ డిసిల్వా ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు.
ఏకంగా 109 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డిక్లేర్ చేసిన వెంటనే నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన పాక్ ఆదిలోనే ఒక వికెట్ కోల్పోయింది.
దీంతో ఓటమి నుంచి కాపాడుకునే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ , ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్. ఇద్దరూ రెండో వికెట్ పోకుండా కాపాడుకుంటూ వచ్చారు నాలుగో రోజు ఆట ముగిసే సరికి.
హక్ 46 రన్స్ తో ఉండగా బాబర్ ఆజమ్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది. ఇంకా రెండో టెస్టు ముగిసేందుకు ఒక రోజు మిగిలి ఉంది.
శ్రీలంక బౌలర్లు గనుక రెచ్చి పోతే పాక్ కు ఓటమి తప్పదు. ఇదిలా ఉండగా రెండు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో మొదటి టెస్టు లో పాకిస్తాన్ విజయం సాధిస్తే రెండో టెస్టు కీలకంగా మారింది.
ఒక వేళ పాకిస్తాన్ ఈ టెస్టులో గెలవాలంటే ఇంకా చేతిలో 9 వికెట్లు ఉన్నాయి 419 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ధనంజయ డిసిల్వతో పాటు కెప్టెన్ కరుణ రత్నే 61 రన్స్ చేస్తే రమేష్ మెండీస్ 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
Also Read : యువ రెజ్లర్ సూరజ్ సింగ్ సెన్సేషన్