SL vs PAK 2nd Test : లంకేయులు భళా పాకిస్తాన్ విల విల

రెండో టెస్టులో గ్రాండ్ విక్ట‌రీ సీరీస్ స‌మం

SL vs PAK 2nd Test : ఆతిథ్య శ్రీ‌లంక జ‌ట్టు బౌల‌ర్ల దెబ్బ‌కు ఠారెత్తింది బ‌ల‌మైన పాకిస్తాన్. మొద‌టి టెస్టులో అనూహ్యంగా విజ‌యాన్ని సాధించి జోరు మీదుకున్న పాక్ కి కోలుకోలేని దెబ్బ కొట్టారు లంక బౌల‌ర్లు.

ప్ర‌ధానంగా స్పిన్న‌ర్ల మ్యాజిక్ కి చేతులెత్తేశారు పాకిస్తాన్ ఆట‌గాళ్లు. 508 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ ను ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు లంకేయులు.

ప్ర‌భాత్ జ‌య సూర్య మ‌రోసారి తిప్పేశాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో 80 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొడితే రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ పాలిట శాపంగా మారాడు. ఏకంగా 117 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు.

ఇక ర‌మేష్ మెండీస్ తొలి ఇన్నింగ్స్ లో 47 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీస్తే రెండో ఇన్నింగ్స్ లో 101 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

దీంతో ఈ ఇద్ద‌రి స్పిన్నర్ల తాకిడికి పాకిస్తాన్ బ్యాట‌ర్లు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు.

దీంతో రెండో టెస్టులో ఆతిథ్య జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏకంగా వ‌ర‌ల్డ్ టెస్టు ర్యాంకింగ్స్ లో పాక్ ను దాటేసింది. ఇక మ్యాచ్

లో ఐదో రోజు ఓవ‌ర్ నైట్ స్కోర్ తో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 261 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.

ఒక వికెట్ కోల్పోయి 89 ప‌రుగుల‌తో స్టార్ట్ చేసి డ్రా చేసుకుంటుంద‌ని అనిపించినా లంక(SL vs PAK 2nd Test)  బౌల‌ర్లు ఏ మాత్రం చాన్స్

ఇవ్వ‌లేదు పాకిస్తాన్ కి. ఓపెన‌ర్ 49 ప‌రుగులు చేసి ఔట్ కాగా కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ మ‌రోసారి బాధ్యతాయుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.

81 ప‌రుగులు చేశాడు. రిజ్వాన్ 37 ప‌రుగులు చేసినా ఫ‌లితం లేక పోయింది పాకిస్తాన్ ను గ‌ట్టెక్కించ లేక పోయారు. ఆలం 1, అఘా స‌ల్మాన్ 4,

న‌వాజ్ 12, యాసిర్ షా 27 , హ‌స‌న్ అలీ 11 , న‌సీమ్ షా 18 ప‌రుగుల‌కు వెనుదిరిగారు.

ఆలం ర‌నౌట్ అయ్యాడు. మిగ‌తా వికెట్ల‌న్నీ స్పిన్న‌ర్లు తీసిన‌వే కావ‌డం విశేషం.

Also Read : సీనియ‌ర్ల‌ను మ‌రిపించార‌న్న ధావ‌న్

Leave A Reply

Your Email Id will not be published!