National Comment : కాల‌యాప‌న‌ కోస‌మేనా పార్ల‌మెంట్ ఉన్న‌ది

కామెంట్స్ కు వేదిక కావ‌డం బాధాక‌రం

National Comment : పార్ల‌మెంట్ అంటే దేశానికి సంబంధించిన దేవాల‌యం అని చెప్పిన మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ భీం రావ్ అంబేద్క‌ర్.

రాజ్యాంగం సాక్షిగా ఏర్పాటు చేసుకున్న ఎగువ‌, దిగువ స‌భ‌లు ఇవాళ అధికార‌, విప‌క్షాల స‌భ్యుల వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, ఆధిప‌త్య భావ‌జాలాల‌కు వేదిక కావ‌డం, ప్ర‌తీకారాల‌కు, క‌క్ష‌ల‌కు, కార్ప‌ణ్యాల‌కు, రాగ ద్వేషాల‌కు కేరాఫ్ గా మార‌డం దారుణం.

ఇందు కోస‌మేనా ల‌క్ష‌లాది మంది త‌మ విలువైన ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. దేశం కోసం ఉరికొయ్య‌ల‌ను ముద్దాడింది మీరు కొట్లాడుకునేందుకేనా.

ఇవాళ వీళ్ల‌ను చూస్తే న‌వ్వు త‌ప్ప ఇంకేమీ క‌ల‌గ‌డం లేదు. ఒక‌ప్పుడు పార్ల‌మెంట్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు వేదిక‌గా ఉండేది. ప్ర‌తిప‌క్షాల స‌భ్యులు మాట్లాడితే అధికారంలో ఉన్న వారు ఆల‌కించేది.

కొంత మంది మంత్రులు నోట్స్ రాసుకునే వారు. కానీ ఇప్పుడు ఆ సీన్ క‌నిపించ‌డం లేదు. కాగితాలు చించేయ‌డం, పోడియం వ‌ద్ద‌కు వెళ్ల‌డం, స్పీక‌ర్ నానా మాట‌లు అన‌డం, ఆపై స‌స్పెన్ష‌న్ల‌కు గురి కావడం..ఇదేనా పార్ల‌మెంట్ అంటే.

అందుకేనేమో సినిమాల్లో కాస్తా వ్యంగ్యంగా చూపిస్తున్నారు. ఆ స్థాయికి చేరుకున్నారు ఎన్నికైన ప్ర‌భువులు ఎంపీలు. ఒక‌రు కామెంట్ చేయ‌డం దానిని ఇంకొక‌రు ఎత్తి చూప‌డం(National Comment) .

విలువైన స‌మ‌యాన్ని వృధా చేయ‌డం. త‌మ‌కు కావాల్సిన బిల్లుల‌ను పాస్ చేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది.

అర్థ‌వంత‌మైన చ‌ర్చ లేకుండా బిల్లులు పాస్ చేయ‌డం అంటే ఈ దేశంలో ప్ర‌జాస్వామం లేన‌ట్టేన‌ని అంబేద్క‌ర్ అన్న మాట మ‌రోసారి గుర్తు చేయాల్సి వ‌స్తోంది.

ప్లీజ్ ఓ మ‌హాత్మా ఓ మ‌హ‌ర్షీ నా దేశాన్ని ర‌క్షించు అని అనాల్సి వ‌స్తోంది.

Also Read : ప్ర‌తి దానికి ప‌రిమితి ఉంటుంది – సుప్రీంకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!