Chess Olympiad 2022 : ‘జ్యోతి’ అందుకున్న పీఎం..సీఎం

జ్యోతిని అంద‌జేసిన వ‌ర‌ల్డ్ గ్రాండ్ మాస్ట‌ర్ ఆనంద్

Chess Olympiad 2022 : త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో ఇవాళ అరుదైన సన్నివేశానికి వేదికైంది. పూర్తిగా త‌మిళ‌నాడు వాసిగా పంచె క‌ట్టుతో ద‌ర్శ‌నం ఇచ్చారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

44వ చెస్ ఒలింపియాడ్(Chess Olympiad 2022) వేదిక‌పై పీఎం మోదీతో పాటు సీఎం ఎంకే స్టాలిన్ ఆసీనుల‌య్యారు. స్థానిక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అంగ‌రంగ వైభ‌వంగా ఈ జ్యోతి అంద‌జేసే కార్య‌క్ర‌మం జ‌రిగింది. వేలాది మంది స్టేడియంలో ఆసీనుల‌య్యారు. ఈ జ్యోతిని మొద‌ట‌గా ఢిల్లీలో దేశ ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు.

అది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌ను చుట్టి వ‌చ్చింది. గురువారం ప్రపంచ గ్రాండ్ మాస్ట‌ర్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్ చెస్ ఒలింపియాడ్ జ్యోతిని తానే తీసుకు వ‌చ్చారు. వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చారు.

ఆ జ్యోతిని ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీకి, సీఎం ఎంకే స్టాలిన్ కు అంద‌జేశారు. మామల్ల‌పురం తీర దేవాల‌యం ప‌క్క‌నే ఇది కొలువు తీర‌డం విశేషం.

న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం. అనంత‌రం ప్ర‌ధాని, సీఎం యువ గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్. ప్ర‌జ్ఞానానంద , ఇత‌రుల‌కు అంద‌జేశారు.

అంత‌కు ముందు క్లాస్ లైటింగ్ , ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అబ్బుర ప‌రిచింది. ఈ కార్య‌క్ర‌మంలో త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ఘ‌నంగా స‌త్క‌రించారు.

అంత‌కు ముందు బార్డ‌ర్ శాలువాతో క‌ప్పుకున్న ప్ర‌ధాని మోదీ వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చేంత వ‌ర‌కు దారి పొడవునా సంగీత‌కారులు, పెర్క‌ష‌న్ వాయిద్య‌కారుల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

Also Read : దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పాడి ప‌రిశ్ర‌మ కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!